అంచనాలను అందుకోవడంలో విఫలమైతే ఆ భారం మోయాల్సింది దర్శకుడే. ఈ విషయంలో అజయ్ భూపతి తన నిజాయితీని చాటుకున్నారు. ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు భేషరతుగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తెలుగు చిత్రసీమ లో భారీ అంచనాల మధ్య విడుదలైన `మహాసముద్రం` ఫ్లాపవ్వడంతో దర్శకుడిగా ఆయన అందుకు బాధ్యతను తీసుకున్నారు. అక్టోబర్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలవడంతో ఫ్యాన్స్ కి సారీ చెప్పారు. ఈ చిత్రంలో శర్వానంద్- సిద్ధార్థ్- అదితి రావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసినదే.
సినిమా పరాజయంపై నిరాశను వ్యక్తం చేసిన నెటిజనుల్లో ఒకరికి అజయ్ భూపతి క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయానని అజయ్ అంగీకరించాడు. ``మహా సముద్రం ఏంటి అన్నా అలా తీశావు చాలా ఎక్స్‌పెక్ట్ చేసాను`` అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..దానికి బదులిస్తూ..``మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి... మీ అందరినీ సంతృప్తి పరచగల కథతో నేను మళ్లీ వస్తాను`` అని తెలిపారు.
తొలి నుంచి ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అంటూ మహాసముద్రంపై హైప్ పెంచేయడం కూడా పెద్ద మైనస్ అయ్యిందనే చెప్పాలి. మరోవైపు సిద్ధార్థ్ ఈ సినిమాతో తెలుగు సినిమాకి రీఎంట్రీ ఇవ్వనుండడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ కూడా తన మాటలతోనే భారీ కలరింగ్ ఇచ్చేయడం కూడా మైనస్ గానే మారాయని విశ్లేషిస్తున్నారు. వారం రోజులు కూడా సినిమా సరైన థియేట్రికల్ రన్ సాధించలేకపోయింది.
ఫ్లాప్ నుంచి స్కిప్ కొట్టిన హీరోలు..!
మహాసముద్రం మూవీకి ఆరంభమే టాక్ డివైడ్ గా వుండటం.. సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం.. రివ్యూస్ .. బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే. అజయ్ తొలి మూవీ ఆర్.ఎక్స్ 100ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించి మంచి ఇంపాక్ట్‌ని కలిగించాడు. కానీ అదే ఇంపాక్ట్ ని `మహా సముద్రం` విషయంలో మాత్రం కలిగించలేకపోయాడు. మల్టీస్టారర్ కథగా రాసుకున్నా ఆశించిన ఔట్ పుట్ ని తేవడంలో విఫలమయ్యాడు. నిజానికి ఈ మూవీ కోసం ముందు నాగచైతన్యని సంప్రదించాడు. చైతూ ఓకే అని చెప్పినా ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
చివరికి రవితేజని సంప్రదిస్తే తను ఓకే అన్నాడు. ఆ తరువాతే స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. అటుపై సిద్ధార్థ్ లైన్ లోకి వచ్చాడు. కానీ మధ్యలో ఏమైందో రవితేజ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కథనాలొచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చివరికి అనిల్ సుంకర దగ్గరకు చేరింది. శర్వా రంగంలోకి దిగారు. సిద్ధార్థ్ -శర్వా ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కింది. సినిమా చివరికి ఫ్లాప్ అని తేలడంతో రవితేజ .. నాగచైతన్య లాంటి స్టార్లు తప్పించుకున్నారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో కామెంట్లు చేయడం తెలిసినదే. ఈ సినిమాతో ఘనంగా రీఎంట్రీ ఇవ్వాలనుకున్న సిద్ధార్థ్ కి కంబ్యాక్ అవ్వాలనుకున్న శర్వాకు కూడా ఇది పెద్ద మైనస్ అంటూ నెటిజనుల్లో చర్చ సాగుతోంది.