బ్రేకప్‌ గురించి ప్రశ్నిస్తే హీరోయిన్‌ స్పందన ఇదే

Update: 2022-04-27 06:30 GMT
తెలుగు ప్రేక్షకులకు భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్ వాంటెడ్‌ క్రేజీ బ్యూటీగా మారింది. హిందీ అర్జున్ రెడ్డి సినిమా ఈమె కెరీర్‌ ను పూర్తిగా మార్చేసింది. అక్కడ ఈ అమ్మడికి స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోలు.. క్రేజీ హీరోల వరకు ప్రతి ఒక్కరి నుండి ఆఫర్లు వస్తున్నాయి.

కెరీర్‌ పరంగా నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా సంతోషంగా ఉన్న కియారా అద్వానీ వ్యక్తిగతంగా మాత్రం కాస్త లో గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె హీరోయన్ గా వరుస సినిమాలు చేస్తున్న ఈ సమయంలోనే తన ప్రియుడితో బ్రేకప్‌ అయిన వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్ర తో ప్రేమలో పడింది. ఇద్దరు కూడా ఆవిషయాన్ని బాహాటంగానే ప్రకటించారు.

ఇద్దరు కలిసి నటించడం మాత్రమే కాకుండా కలిసి పార్టీలకు హాజరు అయ్యారు.. ఎన్నో సార్లు బయట కనిపించారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా వీరిద్దరు కూడా విడి పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో వారి ప్రేమ వ్యవహారం ముందుకు సాగలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఇద్దరు బ్రేకప్ అయిన విషయం బాలీవుడ్‌ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు వారిద్దరి మాత్రం అధికారికంగా ఆ విషయాన్ని దృవీకరించలేదు. తాజాగా ఒక ఈవెంట్‌ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన కియారా అద్వానీని బ్రేకప్ గురించి మీడియా వారు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఆమెను పదే పదే సిద్దార్థ్‌ గురించి అడగడం కూడా జరిగింది.

బ్రేకప్ గురించి ఆమెను ప్రశ్నించిన సమయంలో ఆమె అసహనంకు గురి అయినట్లుగా కనిపించింది. అంతే కాకుండా ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి స్కిప్ చేసినట్లుగా వ్యవహరించింది. మీడియా వారు ఆమె ను మళ్లీ మళ్లీ ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆమె పీఆర్ టీమ్‌ మీడియా వారిని ఆపే ప్రయత్నం చేశారు.

మొత్తానికి బ్రేకప్‌ అబద్దం అయితే వెంటనే ఆ వ్యాఖ్యలను కొట్టి పారేసిది. నిజం కనుక మౌనంగా ఉందంటూ మీడియా వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే హీరోయిన్ గా ఈమె హిందీలో పలు సినిమాలు చేస్తోంది. తెలుగు లో రామ్‌ చరణ్ తో కలిసి శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News