నీటిలో 7 నిమిషాలు ఊపిరిబిగబట్టిన హీరోయిన్.. చనిపోయాననుకుందట..

Update: 2021-03-01 23:30 GMT
'అవతార్-1' సినిమాతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన జేమ్స్ కామెరాన్ తాజాగా దానికి కొనసాగింపుగా తీస్తున్న చిత్రం 'అవతార్2'. ఈ సినిమా కోసం ప్రపంచ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాపై యావత్ ప్రపంచం దృష్టి నెలకొంది. సినిమా కోసమే కాదు.. షూటింగ్ కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.ఈ అవతార్2 సినిమాలో టైటానిక్ ఫేమ్ 'కేట్విన్ స్లేట్' కీలక పాత్ర పోషించింది. ఊపిరి బిగబట్టి నీటి అడుగులో 7 నిమిషాల 14 సెకన్ల సీన్ ఒకటి చేసింది. ఈ ఫొటో షేర్ చేసినప్పుడు అభిమానులు అబ్బురపడ్డారు.

ఈ సీన్ గురించి కేట్ విన్ స్లేట్' ఓ మ్యాగజైన్ తో తన అనుభవాలను పంచుకున్నారు.' మైండ్ బ్లాంక్ అయ్యింది. నీటి బుడగలను చూడడం తప్ప ఏ ఆలోచన లేదు. ఒక దశలో నేను చనిపోయానా? అనిపించింది. చనిపోయానని అనుకున్నాను కూడా అని సంచలన విషయాలు వెల్లడించింది.అవతార్ 2 సినిమా కోసం కేట్ విన్ స్లేట్ ఒక కొత్త రికార్డు నెలకొల్పింది. 'మిషన్ ఇంపాజబుల్' సినిమా కోసం టామ్ క్రూజ్ ఆరు నిమిషాల అరసెకను ఊపిరిబిగబడితే.. కేట్ విన్ స్లేట్ ఏకంగా ఏడు నిమిషాలకు పైగా బిగబట్టి రికార్డు నెలకొల్పింది.
Tags:    

Similar News