అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా విడుదల తేదీ దగ్గర పడింది. అయినా ఇంకా షూటింగ్ ను దర్శకుడు పూర్తి చేయలేదు. ఒక వైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరో వైపు బన్నీ మరియు సమంతలపై ఐటెం సాంగ్ ను మొదలు పెట్టాడు. నేటి నుండి ఆరంభం అయిన ఐటెం సాంగ్ షూటింగ్ ను నాలుగు లేదా అయిదు రోజుల్లోనే పూర్తి చేయబోతున్నారు. సమంత మరియు బన్నీ లపై ఈ ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఐటెం సాంగ్ పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో దేవి శ్రీ ప్రసాద్ మంచి మాస్ బీట్స్ ను ఇవ్వడం జరిగిందట.
గణేష్ ఆచార్య చాలా స్పెషల్ మాస్ స్టెప్పులను ఈ పాట కోసం కంపోజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సమంత కాస్త హాట్ గానే ఈ పాటలో కనిపించబోతుంది. అల్లు అర్జున్ మరియు సమంత లు కలిసి ఇంతకు ముందు సినిమాల్లో నటించారు. కాని మొదటి సారి బన్నీ కి జోడీగా ఐటెం సాంగ్ లో సామ్ నటించింది. పైగా వివాహ బంధానికి వీడ్కోలు పలికిన తర్వాత సమంత చేస్తున్న ఐటెం సాంగ్ ఇది. కనుక ఈ పాట చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. సమంత మరియు బన్నీల మాస్ స్టెప్పులతో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ ఇంకా భారీ ఎత్తున సైడ్ డాన్సర్స్ కూడా ఉంటారని అంటున్నారు.
ఈ సినిమాను తెలుగు తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో మరియు ఉత్తరాదిన కూడా విడుదల చేయబోతున్నారు. అన్ని భాషల్లో కూడా ఆకట్టుకునే కథ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా చెబుతున్నారు. ఇక హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించగా కీలక పాత్రలో సునీల్ మరియు ఫాహద్ ఫాజిల్ లు నటించారు. మరో సారి సుకుమార్ చాలా నమ్మకం పెట్టుకుని అనసూయకు కీలక పాత్రను ఇచ్చాడు. ఆ పాత్రను అనసూయ రంగమ్మత్త పాత్రకు ఎలా అయితే న్యాయం చేసిందో ఈ పాత్రకు కూడా న్యాయం చేసినట్లుగానే ఫస్ట్ లుక్ తర్వాత అనిపిస్తుంది. సినిమా భారీ టెక్నికల్ వ్యాల్యూస్ మరియు స్టార్ కాస్టింగ్ తో రూపొందిన నేపథ్యంలో అంచనాలు పీక్స్ లో ఉండి మంచి బిజినెస్ జరుగుతోంది. బన్నీ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా గా ఇదే నిలిచే అవకాశం ఉంది. విడుదల తర్వాత వసూళ్ల విషయంలో కూడా పుష్ప నే టాప్ లో వుంటుందనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.