పాన్ ఇండియా కంటెంట్ దేశీ వినోదరంగాన్ని మరో లెవల్ కి తీసుకెళుతోంది. బాహుబలి ఫ్రాంఛైజీతో మొదలైన ఈ కొత్త చొరవ దేశంలోని దర్శకనిర్మాతలందరినీ యూనిక్ థాట్ ప్రాసెస్ లోకి తీసుకెళ్లింది. అంతకుముందు సినిమా అనేది ఏదో ఒక ప్రాంతానికి చెందినది అనే భావన ఉండేది.
ఇప్పుడు అది లేదు. కంటెంట్ యూనివర్శల్ అయితే దేశంలో ప్రపంచంలో ఎక్కడ అయినా రిలీజ్ చేయొచ్చు అనే ప్రపంచీకరణ సూత్రాన్ని నిర్మాతలు అనుసరిస్తున్నారు. దాని ప్రకారమే భారీ బడ్జెట్లు వెచ్చిస్తూ సౌత్ నార్త్ అనే విభేధం లేకుండా అన్నిచోట్లా రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గ బిజినె్ ని కూడా అందుకుంటున్నారు.
తెలుగు సినిమా ఇమేజ్ అమాంతం పెరిగిన ఈ తరుణం మహేష్ కి చెందిన జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేయడం ఆసక్తికరం. గూఢచారి ఫేం అడివి శేష్ నటిస్తున్న `మేజర్`కి మహేష్ నిర్మాత. ఇది పలు భాషల్లో తెరకెక్కి పాన్ ఇండియా కేటగిరీలోనే విడుదలవుతోంది. ఇప్పటికే మేజర్ కి రకరకాల సందర్భాల్లో శేష్ ప్రమోషన్ వైరల్ గా దూసుకెళ్లింది.
అయితే మేజర్ రిలీజ్ తేదీపై ఇప్పటికీ క్లారిటీనివ్వలేదు. ఇంతలోనే శేష్ ట్వీట్ చేస్తూ.. క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. `` సినిమా అనేది నిజం.. సెకనుకు 24 ఫ్రేమ్ లు..`` అంటూ జీన్ లూకా గొడార్డ్ చెప్పిన ఎలిమెంట్ ని టచ్ చేస్తూ .. మేజర్ - ది ఫిల్మ్ రిలీజ్ తేదీని సరైన మార్గంలో నిర్ణయిస్తామని వెల్లడించారు.
సరైన తేదీని ఎంపిక చేయాల్సి ఉందని అన్నారు. ఎందుకంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది నా నిజం! #MAJOR కా ప్రామిస్ హై యే..! అంటూ ట్వీట్ చేశారు. సాధ్యమైనంత తొందర్లోనే శేష్ లోంచి నిజం బయటకు రావాల్సి ఉంటుంది. దానర్థం రిలీజ్ తేదీ వెల్లడిస్తాడనే. బహుశా ఈ సినిమా సమ్మర్ లో పలు భాషల్లో విడుదలవుతుందని సరైన డేట్ వెల్లడస్తారని భావిస్తున్నారు.