సమంత తప్పుకున్న వార్తలు నిజం కాదు

Update: 2023-01-03 11:30 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆమె అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు. కనీసం ఆమె మీడియా ముందుకు కూడా రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

సమంత ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడంతో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ వెబ్‌ సిరీస్‌ నుండి ఈమె తప్పుకుందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. అంతే కాకుండా వరుణ్ ధావన్ తో సమంత కమిట్ అయిన సినిమా కూడా క్యాన్సిల్‌ అయ్యిందని ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.

సమంత చేతి నుండి ఆ రెండు ప్రాజెక్ట్‌ లు చేజారినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని.. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్‌ లు లైన్ లో ఉన్నాయని... వారు సమంత ఆరోగ్యం మెరుగు పడటం కోసం చూస్తున్నారని.. అంతే కాకుండా త్వరలోనే షూటింగ్‌ లో సమంత పాల్గొనబోతుంది అంటూ వారు నమ్మకంతో ఉన్నారట.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఆరోగ్యం మెరుగు పడిందని.. ఈ నెలలోనే సమంత తన ప్రాజెక్ట్‌ ల యొక్క షూటింగ్‌ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదట ఖుషి సినిమా యొక్క షూటింగ్‌ లో సమంత పాల్గొనబోతుందనే వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ యొక్క ఖుషి సినిమా షూటింగ్‌ లో దాదాపుగా రెండు వారాలు నటించిన తర్వాత హిందీ వెబ్‌ సిరీస్ షూటింగ్‌ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. వరుణ్ దావన్ హీరోగా నటించబోతున్న సినిమా షూటింగ్‌ లో ఫిబ్రవరి మరియు మార్చి నెలలో సమంత పాల్గొనబోతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఆ వార్తలు నిజం కాదని.. సమంత త్వరలోనే హిందీ సినిమా మరియు సిరీస్ షూట్‌ లో పాల్గొనబోతుందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News