బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం సినీ ఇండస్ట్రీలో అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అందరూ డిప్రెషన్ కి గురవడానికి గల కారణం ఇండస్ట్రీ వ్యక్తులే అని పలువురు ఆరోపిస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో గుర్తింపు పొందిన సుశాంత్ సూసైడ్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని కంగనా రనౌత్ ప్రకాష్ రాజ్ అభినవ్ కశ్యప్ లాంటి వారు బాహాటంగానే చెప్పకనే చెప్పారు. దీంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై చర్చకు దారితీసింది. పోలీసులు కూడా అనేక కోణాల్లో సుశాంత్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన పోలీసులు కొన్ని కీలకమైన సమాచారాన్ని రాబట్టారట.
కాగా సుశాంత్ మరణించడానికి మూడు రోజుల ముందు అతను డబ్బులు ఇవ్వాల్సిన వారందరికీ తిరిగి చెల్లించేశాడట. అంతేకాకుండా తన దగ్గర పనిచేసే స్టాఫ్ కి కొన్ని నెలలకు సరిపోయే విధంగా జీతాలను కూడా ఇచ్చేశాడట. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని వారితో అన్నాడట. సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్న సుశాంత్ కి ఫైనాన్సియల్ ప్రాబ్లమ్ రావడానికి కారణం సినిమా ఆఫర్స్ దూరమవ్వడమే అని తెలుస్తోంది. 'చిచోరే' సినిమా తర్వాత ఓకే చేసిన చాలా సినిమాలు దూరమయ్యాయట. అంతేకాకుండా సుశాంత్ సైన్ చేసిన ఓ వెబ్ సిరీస్ నుండి రావాల్సిన రెమ్యూనరేషన్ కోసం కూడా వెయిట్ చేశాడట. అయితే సుశాంత్ మాజీ సెక్రటరీ మరణంతో ఈ వెబ్ సిరీస్ కూడా దూరమయ్యే పరిస్థితులు వచ్చాయట. ఆమె మరణం కూడా సుశాంత్ ని బాగా కృంగదీసిందట. ఇలా అన్ని ఒక్కసారిగా రావడంతో డిప్రెషన్ కి లోనై బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పుకుంటున్నారు.