కోటలో రాణి.. తోటలో రాముడు వంటి కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూ వస్తున్నారు. మహారాజ కుటుంబంలో పుట్టిన యువతి అజ్ఞాత వాసంలో విహరిస్తున్న సమయంలో ఓ సాధారణ యువకుడిని ప్రేమించడం, ఆ తరువాత అతనికి తను ప్రిన్సెస్ అని తెలియడం వంటి కథలు చాలా వరకు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ అలరిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'మల్లీశ్వరి' మూవీ ఇదే పంథాలో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించిన విషయం తెలిసిందే. పెళ్లికాని ప్రసాద్ కు కోటలో యువరాణి అయిన కత్రినాకు మధ్య ప్రేమ మొదలు కావడం.. ఆ తరువాత తను సాధారణ యువతి కాదని, మీర్జాపూర్ యువరాణి అని తెలియడం.. తనని అందుకునే భాగ్యం తనకు లేదని హీరో అనుకోవడం.. ఆ తరువాత యువరాణి అతని ప్రేమని గుర్తించి ఇద్దరు ఒక్కటవ్వడం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి వెంకటేష్ ఖాతాలో భారీ హిట్ గా నిలిచింది.
ఇప్పడు ఇదే ఫార్ములాతో 'సీతారామం' మూవీని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రల్లో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీ యునానిమస్ గా ఫస్ట్ షోతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హైదరాబాద్ ప్రిన్సెస్ నూర్జహాన్ గా కనిపించింది. ఇండియన్ సోల్జర్ లెఫ్టినెంట్ రామ్ కు ప్రిన్సెస్ నూర్జహాన్ కు మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ మూవీని ఓ క్లాసిక్ గా దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ మూవీపై ఆసక్తికరమైన వార్తలు తాజాగా బయటికి వస్తున్నాయి. ఈ సినిమా కథ వేరే మూవీని పోలివుందని పలువురు కామెంట్ లు చేస్తున్నారు. సిటిజన్ కేన్, మల్లీశ్వరి సినిమాల షేడ్స్ ఈ మూవీలో కనిపిస్తున్నాయని అంటున్నారు.
అయితే ఈ మూవీ స్క్రీన్ ప్లే ను ఏ సినిమా నుంచి ప్రేరణ పొందాడో స్వయంగా దర్శకుడు హను రాఘవపూడి స్పష్టం చేయడం విశేషం. సినిమా విజయం సాధించిన నేపథ్యంలో మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన దర్శకుడు హను రాఘవపూడి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఈ మూవీ స్క్రీన్ ప్లే కెనడియన్ మూవీ 'ఇన్ సెండీస్' నుంచి స్ఫూర్తి పొందానని తెలిపారు. 'సీతా రామం' సక్సెస్ తో టాలీవుడ్ లో ప్రిన్సెస్ కథలకు తిరుగులేదని మరోసారి నిరూపించడం విశేషం.