వీడియోః 'వసంత కోకిల' రుద్ర రేంజ్ అదిరింది

Update: 2021-01-27 03:35 GMT
బాబీ సింహా ప్రధాన పాత్రలో మరణన్ పురుషోత్తమ్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న త్రిభాష సినిమా 'వసంత కోకిల' విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమా ఓ విభిన్నమైన జోనర్‌ లో రూపొందిందని మూడు భాషల ప్రేక్షకులకు కూడా తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటూ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ చూసిన వారు అంటున్నారు. థ్రిల్లర్ మూవీగా ఇది కనిపిస్తుంది. ఇక రిపబ్లిక్ డే సందర్బంగా ఒక చిన్న వీడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. రేంజ్ ఆఫ్‌ రుద్ర అంటూ వచ్చిన ఈ వీడియో కు అన్ని భాషల ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తుంది. బాబీ సింహా అదిరిపోయే రేంజ్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే బాబీ సింహా సుపరిచితుడు అయ్యాడు. కనుక ఆయన ఈ సినిమాతో మరింతగా చేరువ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. రేంజ్‌ ఆఫ్‌ రుద్ర వీడియోలో కారు నుండి బాబీ దిగి వచ్చే షాట్స్ ఇంకా చేతిలో ఆయుదం పట్టుకున్న తీరు అత్యంత స్టైలిష్ గా ఉండటంతో పాటు చాలా సస్పెన్స్‌ ను క్రియేట్‌ చేసే విధంగా సినిమా  ఉందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం బాబీ సింహా అభిమానులు అంతా కూడా ఎదురు చూసేలా వీడియో ఉంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాశ్మీర పరదేశీ నటిస్తోంది.

Full View
Tags:    

Similar News