యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమా లు రూపొందుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ వెంటనే గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్ కే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ప్రాజెక్ట్ కే సినిమా కు సంబంధించిన షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.
ప్రాజెక్ట్ కే కోసం దీపిక పదుకునే ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. మొన్నటి వరకు విదేశాల్లో భర్తతో కలిసి చక్కర్లు కొట్టి హాలిడేస్ ను ఎంజాయ్ చేసిన దీపిక ముంబయికి ఇటీవలే తిరిగి వచ్చింది. హాలీడేస్ నుండి వచ్చిన వెంటనే హిందీ సినిమాకు కాకుండా ప్రాజెక్ట్ కే కు డేట్లు కేటాయించింది. ప్రభాస్ మరియు దీపికా పదుకొనే తో పాటు ఇంకా ప్రముఖ నటీనటులు మరియు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు తాజా షెడ్యూల్ లో పాల్గొంటున్నారట.
యూనిట్ సభ్యులు సినిమా కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ఇప్పటి వరకు అధికారికంగా రివీల్ చేయలేదు. షూటింగ్ ఎలా జరుగుతుంది.. ప్రభాస్ లుక్ ఏంటి.. దీపిక పాత్ర ఏంటి.. అసలు కథ కథనం ఏంటీ అనే విషయాలను దర్శకుడు నాగ్ అశ్విన్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు.
ప్రభాస్ మరియు దీపికా పదుకునే లు ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం మాత్రం ఖాయం అంటూ వారు గట్టిగా చెబుతున్నారు. టైమ్ ట్రావెల్ అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. సింగీతం వారితో కలిసి వర్క్ చేయడం వల్ల టైమ్ ట్రావెల్ మూవీ అయ్యి ఉండవచ్చు అనే అనుమానంకు బలం చేకూరినట్లు అయ్యింది.
ఇక ప్రభాస్ మాత్రమే కాకుండా ఈ సినిమా లో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ కూడా కనిపించబోతున్న విషయం తెల్సిందే. కేవలం ఇదో తెలుగు సినిమా లేదా పాన్ ఇండియా సినిమా అని కాకుండా పాన్ వరల్డ్ సినిమా అన్నట్లుగా ఉండబోతుంది అంటూ ఆ మధ్య దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి.
సినిమాకు సంబంధించిన దాదాపు అంత షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆ తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ యూనిట్ సభ్యుల ద్వార అనధికార సమాచారం అందుతోంది. సలార్ మరియు ఆదిపురుష్ ల తర్వాత ప్రాజెక్ట్ కే వస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.