'పవన్-రానా'ల మూవీకి న్యాయం చేయాల్సింది వారిద్దరే..నా??

Update: 2021-01-28 03:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 'రీమేక్'ల ట్రెండ్ బాగానే నడుస్తోంది. ఆల్రెడీ వేరే భాషలో హిట్ అయిన సినిమానే రీమేక్ చేస్తారు కాబట్టి రీమేక్ సినిమాలలో ప్లాప్స్ కంటే హిట్, సూపర్ హిట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా రీమేక్ సినిమాలు తెలుగులో కూడా వర్కౌట్ అవుతుండటంతో హిట్స్ లేని హీరోలంతా రీమేక్ ల బాటపడుతున్నారు. ఇంకా మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో వేరే హీరోతో కలిసి వర్క్ చేయడానికి హీరోలు సిద్ధంగానే ఉంటున్నారు. ఇక గతేడాది మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఎప్పుడో తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు కానీ ఇంతవరకు సినిమా పూర్తికాలేదు. ఈ సినిమా ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల చుట్టూనే తిరుగుతుంది.

మద్యానికి బానిసైన ఒక రిటైర్డ్ హవాల్దారుకి, అతన్ని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారికి మధ్య రగిలిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. ఈ సినిమాలో పోలీస్ అయ్యప్పన్ పాత్రలో బిజుమీనన్, కోషి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. అయితే తెలుగు రీమేక్ లో పృథ్వీరాజ్ పాత్రలో రానా, అయ్యప్పన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమం ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం దశలో ఉంది. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ రచన సహకారం అందించిన ఈ తెలుగు రీమేక్ మూవీని మలయాళం ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా తీయాల్సిన బాధ్యత డైరెక్టర్ పైన, రాయాల్సిన బాధ్యత రచయిత పై ఉంది.

అయితే నటీనటుల ఎంపిక పరంగా ఏకే చిత్రబృందం ఓకే అనిపించినా.. సినిమా సోల్ ఎలా కాపాడతారు అనేది ప్రశ్న. ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియంకు ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది చర్చించాల్సిన అంశం. అయితే ఉద్యోగం కోల్పోయిన పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్, పలుకుబడి కలిగిన ఇగో పాత్రలో రానా బాగానే అనిపిస్తుంది. కానీ వీరిని చూపించేటప్పుడు ఏ ఒక్కరూ తగ్గకుండా ఎలా చూపిస్తారు.. ఎవరిని తక్కువ చేసినా ఫలితం బెడిసికొట్టే అవకాశం ఉంది. కాబట్టి తెలుగులో ఏకే వర్కౌట్ కావాలంటే స్క్రిప్ట్ లో మలయాళం ఫ్లేవర్ తీసేసి పూర్తి తెలుగు ఫ్లేవర్ తీసుకొస్తేనే హిట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. అంతేగాక ఫ్లేవర్ మారినా పర్లేదు కానీ కథాంశం పోకూడదు. అందుకు మరి త్రివిక్రమ్, సాగర్ చంద్రలు ఎలా న్యాయం చేస్తారనేది చూడాలి.
Tags:    

Similar News