తెలుగులో వారసుల హవా గత కొన్ని దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతోంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించిన వారసులు హీరోలుగా రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో వారసుల సంఖ్య భారీ స్థాయిలో వుండగా ఈ జాబితాలోకి మరో స్టార్ ప్రొడ్యూసర్ వారసుడు ఇటీవల చేరిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు కూడా. అతనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్‌రెడ్డి.
స్టార్ ప్రొడ్యూసర్స్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి హీరోగా తెరంగేట్రం చేసిన తొలి చిత్రం 'రౌడీ బాయ్స్'. ఇటీవలే విడుదలై ఈ చిత్రం యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం హీరోగా ఆశిష్ కు తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ తరువాత మరో విభిన్నమైన సినిమాతో ఆశిష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆశిష్ నటిస్తున్న తాజా చిత్రానికి 'సెల్ఫిష్' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విశాల్ కాశి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
విభిన్నమైన కథా, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రాన్ని శుక్రవారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో ఆశిష్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో ధనుష్ క్లాప్ నిచ్చారు.
స్టార్ డైరెక్టర్స్ హరీష్ శంకర్, శ్రీరామ్ వేణు, దిల్ రాజు, శిరీష్ దర్శకుడిగా స్క్రిప్ట్ ని అందజేశారు. షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఆశీష్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
రెడ్ కలర్ యమహా బైక్ పై స్లీవ్ లెస్ జాకెట్ తో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని అల్ట్రా స్టైలిష్ గా కనిసి్తున్నాడు. నేటి యూత్ ట్రెండ్ కి తగిన విధంగా ఆశిష్ లుక్ కనిపిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటూ ప్రాజెక్ట్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్, ఫొటోగ్రఫీ ఎస్ . మణికందన్.