అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎదురే లేని లైనప్ తో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జాన్వీ కెరీర్ ఆరంభం నుంచి ధర్మ ప్రొడక్షన్స్ తోనే సినిమాలన్నీ కమిట్ అవుతోంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన `ధడక్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తర్వాత వరుసగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇటీవలే రూహీ చిత్రంతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న `దోస్తానా-2` చిత్రీకరణలో బిజీగా ఉంది. అనివార్య కారణాల వల్ల మళ్లీ దోస్తానా-2 ని రీషూట్ చేస్తున్నారని సమాచారం.
లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడుతున్నప్పటికీ జాన్వీ మాత్రం మనసు మార్చుకోకుండా ధర్మ ప్రొడక్షన్ లోనే కొత్త సినిమాలు కమిట్ అవుతోంది. తాజాగా మరో సినిమాకు అదే బ్యానర్ లో చేయడానికి సంతకం చేసింది. ఎమోషనల్ రోమ్ కామ్ లో నటించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బొమన్ వారసుడు కయోజ్ ని పరిచయం చేస్తున్నారు. అతని ట్యాలెంట్ ని గుర్తించి కరణ్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిజానికి కయోజ్ తన తండ్రి బాటలో నటుడవ్వాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో కరణ్ జోహర్ నిర్మించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ తర్వాత అతను దర్శకత్వం వైపు దృష్టి పెట్టాడు. ఇప్పుడు కూడా అతడి పరిచయ బాధ్యతల్ని కరణ్ జోహార్ తీసుకోవడం విశేషం. అటు జాన్వీ..ఇటు కయోజ్ బాధ్యతల్ని కరణ్ తీసుకుని స్టార్ కిడ్స్ పాలిట రియల్ గాడ్ ఫాదర్ లా నిలుస్తున్నారు. తన బ్రాండ్ ఇమేజ్ కి ఏమాత్రం భంగం కలగని రీతిలో అతడి ప్లానింగ్ సాగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బొమన్ ఇరానీ ఇంతకుముందు టాలీవుడ్ రికార్డ్ హిట్ మూవీ అత్తారింటికి దారేది (పవన్ కల్యాణ్) చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.