బ్రేకప్‌ పుకార్లకు చెక్‌ పెట్టిన స్టార్ జోడీ

Update: 2022-07-23 23:30 GMT
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ మలైకా అరోరా మరియు యంగ్‌ హీరో అర్జున్ కపూర్ లు బ్రేకప్‌ అయ్యారనే పుకార్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు కలిసి గత కొన్ని వారాలుగా కనిపించక పోవడం తో పాటు.. తనకు ఇష్టమైన ముంబయిలోని ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ ను కూడా అర్జున్‌ కపూర్‌ అమ్మేశాడనే వార్తలు రావడంతో ఇద్దరు బ్రేకప్ అయ్యారనే పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది.

మలైకా అరోరా మరియు అర్జున్‌ కపూర్ ల బ్రేకప్ విషయం జాతీయ మీడియాలో సైతం ప్రధానంగా చర్చ జరిగింది. దాంతో ఇద్దరు బ్రేకప్ అయినట్లే అంటూ బాలీవుడ్‌ లో కూడా చర్చ జరిగింది.

కాని తాజాగా ఇద్దరు కలిసి ఒక పార్టీ లో పాల్గొనడం తో ఆ పుకార్లకు బ్రేక్‌ పడ్డట్లు అయ్యింది. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఆ పార్టీలో కనిపించడంతో బ్రేకప్‌ వార్తలు గాలి వార్తలే అని తేలిపోయింది.

బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు హాజరు అయిన రుస్సో బ్రదర్స్ పార్టీ లో జంటగా మలైకా మరియు అర్జున్‌ కపూర్ లు హాజరు అవ్వడంతో మీడియా దృష్టి వారి పై పడింది. వీరిద్దరు విడిపోయారు అనుకుంటే కలిసి పార్టీకి వచ్చారు అన్నట్లుగా అంతా షాక్‌ అయినట్లుగా చూశారు అంటూ పార్టీకి హాజరు అయిన వారు కొందరు అన్నట్లుగా సమాచారం అందుతోంది.

అర్జున్ కపూర్ కంటే మలైకా అరోరా పదేళ్ల కంటే ఎక్కువ వయసు. దాంతో ఇద్దరి ప్రేమ వ్యవహారం ను చాలా స్పెషల్‌ గా బాలీవుడ్‌ వారు మరియు మీడియా వర్గాల వారు చూస్తూ ఉన్నారు.

పైగా మలైకా సుదీర్ఘంగా కాలం పాటు అర్జాజ్ ఖాన్‌ తో వైవాహిక జీవితం గడిపి కొన్నాళ్ల క్రితం విడిపోయిన విషయం తెల్సిందే. విడిపోయినప్పటిన ఉండి అర్జున్‌ కపూర్ తో రిలేషన్ లో ఈ అమ్మడు ఉందనే వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News