భాష ఏదైనా కూడా సినిమా పరిశ్రమలో ఆడవారు వేదింపులు ఎదుర్కొన్నారు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. మీటూ వచ్చిన తర్వాత లైంగిక వేదింపులు తగ్గినప్పటికి కొందరు ఇంకా బరితెగించి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితి చాలా బెటర్ అంటూ హాలీవుడ్ నటి నోమీ హరిస్ చెప్పుకొచ్చింది. తన కెరీర్ ఆరంభంలో ఒక ఆడిషన్ కు వెళ్లినప్పుడు ఎదుర్కొన్న భయంకర పరిస్థితిని గురించి నోమీ హరిస్ ఇప్పుడు బయట పెట్టింది.
ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు అప్పుడు 20 సంవత్సరాలు ఉంటాయి. సినీ నటిగా కెరీర్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. పలు చోట్ల ఆడిషన్స్ కు వెళ్లాను. ఒకానొక సమయంలో నేను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన స్టార్ హీరో సినిమా కోసం ఆడిషన్స్ కు వెళ్లాను. అక్కడ కాస్టింగ్ డైరెక్టర్.. డైరెక్టర్ మరియు ఆ స్టార్ హీరో ఉన్నాడు. ఆడిషన్స్ కోసం నన్ను పిలిచి నన్ను అసభ్యంగా టచ్ చేశాడు. ఆ హీరో నా స్కర్ట్ లోకి చేయి పెట్టినప్పుడు నేను భయంతో వణికి పోయాను.
ఆ హీరో అలా చేస్తుంటే అక్కడే ఉన్న డైరెక్టర్ మరియు ప్రొడక్షన్ వారు అలాగే చూస్తు ఉండి పోయారు. ఆ సంఘటన నేను జీవితంలో మర్చి పోలేను. అప్పుడు నా కెరీర్ ప్రారంభ స్టేజ్ లో ఉంది కనుక చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఆయన పేరును బయట పెట్టాలని నేను అనుకోవడం లేదు. దీన్ని మరింత పెద్ద వివాదంగా మార్చే ఉద్దేశ్యం లేదంది. కేంబ్రిడ్జి వంటి ప్రపంచ ప్రసిద్ది యూనివర్శిటీలో ఉన్నత చదువు చదివిన నేను ఆ హీరో అలా చేయడంతో తట్టుకోలేక పోయాను. నటన అంటేనే ఆసక్తి పోయింది. కాని మళ్లీ ప్రయత్నాలు చేసి అవకాశాలు దక్కించుకున్నాను. ఆ తర్వాత అంతటి భయంకర పరిస్థితులైతే ఎదురవ్వలేదని నోమీ చెప్పుకొచ్చింది.