బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ లు హిందీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గతంలో వెబ్ సిరీస్ లు నాసిరకంగా లో బడ్జెట్ లో ఉండేవి. కాని ఇప్పుడు పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటున్నాయి. స్టార్ ఫిల్మ్ మేకర్స్ వెబ్ సిరీస్ మేకింగ్ లో భాగస్వామ్యం అవుతున్నారు. దాంతో సినిమాల స్థాయిలో వెబ్ సిరీస్ లకు కూడా బడ్జెట్.. మార్కెట్ ఉంటుంది.
బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ ఒక వైపు పెద్ద సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో వెబ్ సిరీస్ లను కూడా తీసుకు వస్తున్నాడు. తాజాగా ఈయన నిర్మాణం నుండి రాబోతున్న వెబ్ సిరీస్ 'ఫేమ్ గేమ్'.
మాధురి దీక్షిత్ ప్రథాన పాత్రలో నటించిన ఈ ఫేమ్ గేమ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఈనెల 25 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమలో హీరోలు మరియు హీరోయిన్స్ ఎంతో గ్లామర్ గా.. గ్లిట్లర్ గా కనిపిస్తారు. వారిని అభిమానించే వారు ఎప్పటికి వారిని అలాగే చూడాలని కోరుకుంటారు.
కాని తారల తెర వెనుక జీవితంలో మరో విధంగా జరుగుతూ ఉంటుంది. కలర్ ఫుల్ లైఫ్ ను వెండి తెరపై చూపించే కొందరు తారల జీవితంలో కలర్ అనేది లేకుండా చీకటి ఉంటుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాంటి ఒక తార జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ 'ఫేమ్ గేమ్' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
అనామిక ఆనంద్ అనే ఒక నటి కథ తో ఈ సినిమా రూపొందింది. అనామిక పాత్రలో మాధురి దీక్షిత్ కనిపించబోతున్నారు. హీరోయిన్ గా ఎంతో ఫేమస్ అయిన అనామిక ఆనంద్ అనూహ్యంగా కనుమరుగు అవ్వడంతో ఆమె అభిమానులకు సస్పెన్స్ గా మారుతుంది. ఆమె అదృశ్యం అయ్యి పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఎంక్వౌరీ చేస్తున్న సమయంలో వెబ్ సిరీస్ మొదలు అవుతుంది. ఎంక్వౌరీ చేస్తున్న సమయంలో ఎన్నో షాకింగ్ విషయాలు తెలుస్తూ ఉంటాయట. ఆ విషయాలు ఏంటీ.. అసలు అనామిక రీల్ లైఫ్ లో సూపర్ స్టార్ గా ఎదిగినా రియల్ లైఫ్ లో అత్యంత దయనీయ పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది వెబ్ సిరీస్ లో చూపించారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఆడియన్స్ ను థ్రిల్ చేసే విషయాలు ఎన్నో ఈ వెబ్ సిరీస్ లో ఉంటాయట. కొన్ని సన్నివేశాలు సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. మాధురి దీక్షిత్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క హిందీ ఓటీటీ ప్రేక్షకుడు కూడా ఫేమ్ గేమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.