బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నాయి. మాదకద్రవ్యాల రవాణా, వాడకం ఆరోపణలపై అరెస్టయిన ఆర్యన్ అండ్ కోది అసలు మాదక ద్రవ్యాల కేసే కాదని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆర్యన్ను అధికారికంగా కిడ్నాప్ చేసినట్లు మంత్రి పెద్ద బాంబే పేల్చారు. ఈ కిడ్నాప్ లో సూత్రదారి బీజేపీ నేత మోహిత్ కాంబోజ్ అయితే పాత్రదారి మాత్రం ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సునీల్ వాంఖడే గా మంత్రి చెప్పారు.
నవాడ్ మాలిక్ వ్యవహారం చూస్తుంటే ఆర్యన్ కేసును ఇప్పుడే వదిలేట్లు కనబడటంలేదు. వాంఖడే టార్గెట్ గా మంత్రి రోజుకో ఆరోపణ, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఆర్యన్ క్రూయిజ్ షిప్పులో పట్టుబడిన దగ్గర నుండి మాదకద్రవ్యాల కేసుకన్నా నవాబ్ మాలిక ఆరోపణలే ఎక్కువ సంచలనం కలిగిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. తెరవెనుక జరిగిన ఏ పరిణామాలతో నవాబ్ మాలిక్ ఎన్సీబీ ఉన్నతాధికారి వాంఖడేను టార్గెట్ చేసుకుంటున్నారో స్పష్టంగా తెలియటంలేదు.
ఇపుడు కూడా ఆర్యన్ ది కిడ్నాప్ కేసుగా ఆరోపణలు చేసిన మంత్రి రు. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు చెప్పారు. బేరం రు. 25 కోట్లతో మొదలై చివరకు రు. 18 కోట్లకే కుదిరిందని అందులో రు. 50 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నట్లు కూడా చెప్పారు. మరి ఏ ఆధారాలతో మంత్రి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. మీడియా సమావేశంలో ఆరోపణలు మాత్రమే చేస్తున్న మంత్రి ఒక్కదానికి కూడా ఆధారాలను చూపటంలేదు. అయినా మీడియా మాత్రం మంత్రి ఆరోపణలకు విస్తృతమైన ప్రచారం ఇస్తోంది.
ఎవరిని ఉద్దేశించి అయితే మంత్రి ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పటివరకు నోరిప్పలేదు. నిజంగానే కిడ్నాప్ బేరం రు. 18 కోట్లకు సెటిల్ అయితే ఆ విషయమై ఇప్పటివరకు షారుక్ ఖాన్ ఎందుకని నోరిప్పలేదు. తన కొడుకు ఆర్యన్ విషయంలో మంత్రి చేస్తున్న ఆరోపణలు వాస్తవమో లేకపోతే అవస్తవమనో చెప్పాల్సింది షారుక్ లేదా ఆయన ప్రతినిధులు మాత్రమే. ఆర్యన్ అరెస్టయి ఇప్పటికి నెలన్నర గడిచినా ఇప్పటివరకు షారుక్ ఒక్కసారి కూడా నోరిప్పకపోవటం గమనార్హం.
క్రూయిజ్ షిప్ వివాదాన్ని ముగించాలని అనుకుంటే షారుక్ నోరిప్పాల్సిందే. మంత్రి ఆరోపణలను ఎన్సీబీ ఉన్నతాధికారులు కొట్టేస్తున్నారు. నిజంగానే మంత్రి దగ్గర ఆధారాలుంటే మీడియా సమావేశంలో ఆరోపణలు చేయటం కాకుండా కోర్టులో తమపై కేసు వేసుకోవచ్చని చాలెంజ్ చేశారు. ఎన్సీబీ అధికారుల చాలెంజ్ విషయంలో మాత్రం మంత్రి ఏమీ మాట్లాడటంలేదు. నిజంగానే మాలిక్ దగ్గర ఆధారాలుంటే ఎందుకని కోర్టులో కేసు వేయలేదనే సందేహాలు పెరిగిపోతున్నాయి. సరే ఆరోపణల సంగతెలాగున్నా మొత్తానికి ఆర్యన్ కేసు రోజుకోమలుపు తిరుగుతున్నది.