టాలీవుడ్ కి ఆ యువ నటుడు ఎంతో ఆశతో ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ హీరో అవ్వాలని కలలుగన్నాడు. వెనుక మంచి బ్యాకప్ ఉంది. స్టార్ హీరోల సహకారముంది. బడా నిర్మాణ సంస్థలు ప్రోత్సాహం ఉంది. కానీ ఆ యంగ్ హీరో కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉంది. మంది మార్భలంతో తొలి అడుగు గ్రాండ్ గా పడినా అటుపై వేగాన్ని కొనసాగించడంలో విఫలమే కనిపిస్తుంది.
ఆరేడు సినిమాలు చేసినా ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. అతను సినిమా చేసి మూడేళ్లు అవుతుంది. మరి అంత బ్యాకప్ ఉన్న హీరో ఇంత స్లోగా ఉండటం దేనికి? అంటే! సరైన స్ర్కిప్ట్ దొరక్కే వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మధ్య ఓ సినిమాని సెట్స్ కి తీసుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.
ఆ సినిమా ఉందా? క్యాన్సిల్ అయిందా? అన్నది కూడా క్లారిటీ లేదు. అయితే యువ హీరో మాత్రం కథలు సీరియస్ గానే వింటున్నాడని తెలిసింది. తన వద్దకి వచ్చిన ఏ కథని విడిచిపెట్టడం లేదుట. ఎలాంటి రిఫరెన్స్ లు లేకుండా వెళ్లినా అందుబాటులో ఉంటే గనుక వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తున్నాడుట. ఆన్ ది స్పాట్ ఆ కథ ని ఎంతో ఓపికగా వింటున్నాడుట. నచ్చిన వాటిలో ఇంకా బెటర్ మెంట్ సూచిస్తున్నాడుట. కొంత మంది అప్ కమింగ్ దర్శకులు..రచయితలు ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలిసింది.
రెండు..మూడు సార్లు కలిసిన వాళ్లు ఓ ఐదారుగురు ఉన్నట్లు సమాచారం. వాళ్లలో ముగ్గుర్ని మెయిన్ గా మైండ్ లో పెట్టుకుని తరుచూ వాళ్లతో టచ్ లో ఉంటున్నట్లు తెలిసింది. ఆ ముగ్గురికి అకాశం ఇచ్చే దిశగా ఆ యువ హీరో ఆలోచన చేస్తున్నాడుట. ఆ కథలన్ని మీడియం బడ్జెట్ చిత్రాలని అంటున్నారు. అయితే వాటిని సొంత బ్యానర్లో కాకుండా బయట బ్యానర్లో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడుట.
సొంత బ్యానర్ లో సినిమా చేస్తే ఇప్పటికే డబ్బా కొట్టుకున్నట్లు నెగిటివిటీ ఎక్కువవుతుందని అందుకనే ఇలా బయట బ్యానర్లకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. బ్యానర్ సెట్ కాకపోవడం ఆలస్యానికి ఓ కారణంగా వినిపిస్తుంది. ఈనేపథ్యంలో వీలైనంత త్వరగానే ఆ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే దిశగానే ఆలోచన చేస్తున్నట్లు ఉప్పందింది. మరి ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.