ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వ్యాపారాలపై ఈ ఎఫెక్ట్ పడుతుంది. కేవలం ఇండియన్ మార్కెట్స్ పైన మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలను కరోనా వైరస్ కుదేళయ్యేలా చేస్తుంది. ఇండియాలో అనేక రంగాలపై కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా రంగంపై కూడా కరోనా ప్రభావం కనిపిస్తుంది.
ఇండియాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ ఈనెల 31 వరకు థియేటర్లన్నింటిని బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సినిమా హాల్స్ ను తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించినట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన అధికారి ఒకరు ప్రకటించారు.
ఇప్పటికే కరోనా వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని.. ఇప్పుడు మూసి వేసినా కూడా పెద్దగా సమస్య ఏమీ లేదని కేరళ థియేటర్ల యాజమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమద్య తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల బంద్ పై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే థియేటర్ల సంఘం విజ్ఞప్తి మేరకు బంద్ ను వాయిదా వేశారు. థియేటర్లలో జాగ్రత్తలు తీసుకుంటామని యాజమానులు ప్రభుత్వంకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో తెలంగాణ మొత్తంలో కరోనా వైరస్ బాధితులు పెరిగితే ఖచ్చితంగా టీ ప్రభుత్వం కూడా థియేటర్ల బంద్ కు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.