టిక్కెట్ రేటు తగ్గిస్తేనే థియేటర్లు నిండుతాయా? స్టార్‌డమ్ ఉంటేనే సినిమాలు చూస్తారా? అంటే స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి.
ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించాలంటే సినిమాలో ఉన్న కంటెంటే కీలకమని విశ్లేషకులు చెబుతుంటారు... స్టార్ల సినిమా వేస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తున్నారు. ఫుల్స్ అవుతున్నాయి అంటే అది పూర్తిగా తప్పే. అయితే స్టార్ ఇమేజ్ కొంతవరకూ సినిమాకి కలిసొస్తుందే కానీ అదే నడిపించేస్తుంది అనుకోవడానికి లేదు.
చిన్న సినిమాకి మరీ అంత క్రేజు ఉండదు కాబట్టి, స్టార్‌ల అండ ఉండదు కాబట్టి వాటికి ఓపెనింగులే రాని పరిస్థితి. ఒకవేళ బావున్న చిన్న సినిమాని గుర్తించి అప్పటివరకూ థియేటర్‌లో ఆ సినిమాని ఉంచితే థియేటర్లు ఏకంగా ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో థియేటర్లను వీకెండ్స్‌లో ఫంక్షన్ హాల్స్‌గా మార్చేయాల్సొస్తోందని ఎగ్జిబిటర్లు బెంబేలెత్తుతున్నారు. రోజుకి ఒక్కో మల్టీప్లెక్స్ థియేటర్‌కి మెయింటెనెన్స్‌కి లక్ష ఖర్చవుతుంటే ఆటకు రూ.4 వేలే ఆదాయం వస్తుంటే ఆ థియేటర్‌ని నడిపించడం ఎలా? అందుకే చాలావరకు షోస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి.
మరో వైపు సినిమాల కోసం వేలకు వేలు తగలేయలేక కేవలం టీవీకే అంకితమైపోతున్న కుటుంబాలెన్నో. అందుకే ఎప్పటికప్పుడు టిక్కెట్ రేటు చర్చల్లోకొస్తోంది. టిక్కెట్ రేటు తగ్గిస్తే జనాలు థియేటర్లకు వస్తారన్నది పెద్దల మాట. అలా కాదు సినిమాలో దమ్ముంటే జనాలు తప్పక వస్తారని వాదించేవాళ్లు కూడా లేకపోలేదు. అలా కాకుండా మధ్యే మార్గంగా చిన్న సినిమాలకు పన్ను విధానం మార్చి, చిన్న సినిమాకి చిన్న టిక్కెట్ ధర అన్న పద్ధతిలో రిలీజ్ చేస్తే
బావుంటుందని కొందరు వాదిస్తున్నారు.
ఇటీవల రిలీజైన అరడజను సినిమాల పరిస్థితి వారానికే ఖాళీ. రేయ్, తుంగభద్ర, జండాపై కపిరాజు, రామ్‌లీలా, బందిపోటు, గెడ్డం గ్యాంగ్ మొదలగు సినిమాల ఆటలను ఆదివారం తప్పించి అన్ని రోజుల క్యాన్సిల్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ అయితే ఇలా క్యాన్సిల్ చేసి, ఏదో ఇంగ్లీష్ సినిమా వేసుకుంటారు.. కాని సింగిల్ స్క్రీన్ ధియేటర్ పరిస్థితి ఏంటి? అందుకే చాలావరకు అలాంటి ధియేటర్లను పెళ్ళి మండపాలుగా అద్దెలకు ఇచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం సన్నాఫ్ సత్యమూర్తి రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయి ఈ థియేటర్లన్నీ. ఇలాంటి క్రేజున్న సినిమా వస్తేనే థియేటర్లు నిండుతాయని ఎగ్జిబిటర్ల వెయిటింగ్.
-హ్యాప్రా