అమెజాన్ ప్రైమ్ వీడియోలో త‌మిళ‌ `ఖాకీ`!

Update: 2017-12-16 13:53 GMT
కోలీవుడ్ - టాలీవుడ్ లో కాప్ థ్రిల్లింగ్ స్టోరీల నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. అయితే, గ‌త నెల 17 న త‌మిళంలో విడుద‌లైన ‘ధీరన్ అధికారి ఒండ్రు’ చిత్రం ప్రేక్ష‌కుల‌తోపాటు విమ‌ర్శ‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుంది. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో `ఖాకీ` పేరుతో విడుద‌ల చేయ‌గా, ఇక్క‌డ కూడా ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ద‌క్షిణాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన బెస్ట్ కాప్ థ్రిల్ల‌ర్ మూవీస్ లో ఖాకీ ఒక‌ట‌ని క్రిటిక్స్ కితాబిచ్చారు. ఈ చిత్రానికి ఐఎమ్ డీబీలో 8.6 రేటింగ్ ద‌క్కడం విశేషం. త‌మిళ‌నాడులో ఇప్ప‌టికీ ఈ చిత్రం కొన్ని థియేట‌ర్ల‌లో విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ధీరన్ అధికారి ఒండ్రు’ చిత్రం ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ చిత్ర నిర్మాత ఎస్.ఆర్.ప్రభు తన సినిమా త‌మిళ వెర్ష‌న్ రైట్స్ ను అమేజాన్ వాళ్లకు అమ్మేశాడు. అయితే, ఈ చిత్రం తెలుగు వెర్ష‌న్ `ఖాకీ` ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి రాలేదు.

అయితే, ప్ర‌స్తుతం ‘ధీరన్ అధికారి ఒండ్రు’ త‌మిళ‌నాడులో మంచి క‌లెక్ష‌న్ల‌తో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ స‌మ‌యంలోనే ఆ చిత్రం అమేజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రావ‌డంపై కోలీవుడ్ లో ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు న‌ష్టం క‌లుగుతోంద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. డిజిట‌ల్ రైట్స్ అమ్ముకొనే హ‌క్కు నిర్మాత‌కు ఉంటుందని, అయితే, కొద్ది రోజులు ఆగిన త‌ర్వాత అమ్మి ఉంటే బాగుండేద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సినిమా విడుద‌లైన‌ 3 - 4 వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో - నెట్ ఫ్లిక్స్ ల‌లో రావ‌డంపై టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు రెండు రోజుల క్రితం ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి విదిత‌మే. ఇది చాలా సీరియ‌స్ అంశ‌మ‌ని - సినిమా శాటిలైట్ రైట్స్ - డిజిట‌ల్ రైట్స్ ను ఎంతోకొంత‌కు అమ్మేసి సేఫ్ అయ్యాన‌ని నిర్మాత ఆలోచించే ధోర‌ణి మారాల‌ని ఆయ‌న అన్నారు. ఈ త‌ర‌హా చ‌ర్య‌ల వ‌ల్లే 3.5 రేటింగ్ వ‌చ్చినా కూడా చిన్న సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని తెలిపారు. 
Tags:    

Similar News