టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటి వరకు అయిదు సినిమాలను చేశాడు. మొదటి నాలుగు సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకున్నాడు. మిర్చి సినిమా సమయంలో దేవిశ్రీ ప్రసాద్ తో ఏర్పడిన స్నేహం అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇద్దరి మద్య ఉన్న ర్యాపో తో వచ్చిన నాలుగు సినిమాలు కూడా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. అయిదవ సినిమా ఆచార్య కు కూడా దేవిశ్రీ ప్రసాద్ ను అనుకున్నప్పటికి కూడా చిరంజీవి కాస్త డెప్త్ గా ఆలోచించి మణిశర్మకు అవకాశం ఇవ్వడం జరిగింది.
మణిశర్మ సీనియర్ సంగీత దర్శకుడు మరియు చిరంజీవి మరియు మణిశర్మల కాంబోలో సూపర్ హిట్ లు పడ్డాయి. కనుక చిరంజీవి సూచన మేరకు ఆయన తో వర్క్ చేయడం జరిగిందట. చిరంజీవి సలహా పాటించినందుకు ఆచార్య మ్యూజిక్ ఆల్బం కూడా అద్బుతంగా వచ్చింది.. అంతే కాకుండా ఆర్ ఆర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా మణిశర్మ ఇచ్చారు అనేది టాక్.
ఆచార్య సినిమా కోసం చిరంజీవి సూచన మేరకు మణిశర్మ తో వర్క్ చేసిన కొరటాల శివ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ 30 సినిమా కు సంగీత దర్శకుడు ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ ను రంగంలోకి దించుతాడని కొందరు భావించారు. కాని ఎన్టీఆర్ సూచన మేరకు తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ తో కలిసి వర్క్ చేసేందుకు కొరటాల ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 సినిమాకు అనిరుద్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అనిరుద్ తో కలిసి సినిమా చేయాలని ఎన్టీఆర్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. కాని ప్రతి సందర్బంలో ఏదో ఒక కారణం వల్ల క్యాన్సిల్ అవుతూ వచ్చింది.
అరవింద సమేత సినిమాకు అనిరుద్ ను తీసుకుని మళ్లీ క్యాన్సిల్ చేయడం జరిగింది. తెలుగు లో అనిరుద్ వర్క్ చేసిన సినిమాలు మ్యూజికల్ గా సక్సెస్ అయ్యాయి. కాని సినిమాలు కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ ను దక్కించుకోలేదు. అందుకే ఆయనకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు అనేది కొందరి అభిప్రాయం. ఈ సమయంలో ఎన్టీఆర్ 30 సినిమా లో అనిరుధ్ కు అవకాశం రావడంతో ఖచ్చితంగా ఆయన ముందు ముందు టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలకు వాయించడం ఖాయం అంటూ టాక్ వినిపిస్తుంది.
చిన్న వయసు లోనే తన ప్రతిభతో ప్రతి ఒక్కరిని ఉర్రూతలూగించిన అనిరుధ్ ఎన్టీఆర్ 30 సినిమా తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు తన ప్రతిభ చూపించే అవకాశం ఉంది. అనిరుద్ ప్రతిభ తెలిసిన కొరటాల శివ ఈ విషయంలో ఎన్టీఆర్ కోసం మరోసారి కాంప్రమైజ్ అయ్యాడు అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కాంబో హిట్ అయితే మరిన్ని సినిమాలు ఇదే కాంబోలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లు టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్ ను ఏలేస్తున్నారు. ఈ సమయంలో అనిరుద్ రీ ఎంట్రీ వారికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.