సుశాంత్ సింగ్ - రియా కాల్ రికార్డింగ్స్ చెప్తున్నదేంటి...?

Update: 2020-08-06 14:30 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సంబంధించిన పలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నేషనల్ మీడియా ఛానల్స్ లో రియా చక్రవర్తి కాల్ డేటాను బయటపడినట్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం రియా చక్రవర్తి జనవరి 20 నుంచి జనవరి 24 మధ్య సుశాంత్‌‌ సింగ్ కు 25 ఫోన్‌ కాల్స్ చేసినట్లు తెలిపింది. 5 రోజుల వ్యవధిలో రియా అన్ని సార్లు ఫోన్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు సుశాంత్ ఛండీగర్‌ లో తన సోదరి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ లో మొబైల్ నంబర్ మార్చాడని.. ఈ నంబర్ నుంచి సుశాంత్ తన కుటుంబానికి ఫోన్ చేసి రియా ఆమె కుటుంబం తనను మెంటల్ హాస్పిటల్‌ లో చేర్పించాలని చూస్తున్నారని చెప్పినట్లుగా జాతీయ మీడియా ఛానల్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా మరో నేషనల్ మీడియా ఛానల్ లో సుశాంత్ సింగ్ కాల్ రికార్డ్ బయటకి వచ్చిందంటూ పలు విషయాలు తెలియజేసింది. ఈ కథనం ప్రకారం సుశాంత్ చనిపోవడానికి ముందు.. అంటే జూన్ 8 నుండి జూన్ 14 వరకు సుశాంత్ రియా చక్రవర్తి మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని చెప్పుకొచ్చింది. జూన్ 8న రియా చక్రవర్తి సుశాంత్ ప్లాట్ నుండి వెళ్లిపోయిన తర్వాత సుశాంత్ ఫోన్ నంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు సదరు మీడియా ఛానల్ వెల్లడించింది. ఇలా సుశాంత్ మరియు రియా చక్రవర్తిపై నేషనల్ మీడియా ఛానల్స్ లో విభిన్న కథనాలు వెలువడుతున్నాయి. కాగా సుశాంత్ సూసైడ్ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీహార్ పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ నివేదికను పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణను ముందుకు తీసుకుపోనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డాక్యూమెంట్స్ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ బీహార్ పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News