నా జెర్నీలో ఎన్నో కష్టాలున్నాయ్: విష్వక్ సేన్

Update: 2022-05-04 03:52 GMT
విష్వక్సేన్ - రుక్సార్ థిల్లాన్ జంటగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. పెళ్లి చూపులు ప్రధానంగా చేసుకుని నడిచే కథ ఇది. లవ్ తో పాటు ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చిన సినిమా ఇది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పించిన ఈ సినిమాకి, బాపినీడు -  సుధీర్ నిర్మాతలుగా వ్యవహరించారు.

విద్యాసాగర్ చింతా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఖమ్మంలో నిర్వహించారు.

ఈ వేదికపై విష్వక్సేన్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్ర పేరు అర్జున్ కుమార్ అల్లం. బేసిగ్గా వాడికి భయం ఎక్కువ .. ఇన్ఫీరియారిటీ ఎక్కువ. వాడిలాగే మనందరిలోను ఒక కామన్ పాయింట్ ఉంది. 25 ఏళ్లకే  చదువైపోవాలి .. పెళ్లైపోవాలి ..  30 ఏళ్లకే సెటైలైపోవాలని ప్రతి ఒక్కరూ లిమిటేషన్స్ పెడుతుంటారు. ఆ లిమిటేషన్స్ వలన అతను భయంతో బ్రతుకుతుంటాడు. 33 ఏళ్లు వచ్చిన తరువాత ఈ భయాలను దాటుకుని అతను ఏం చేశాడనేదే కథ. ఈ నెల  6వ తేదీన థియేటర్లకు వస్తున్న ఈ సినిమాను మీరంతా తప్పకుండా చూడండి.
 
ఎప్పుడూ కూడా నేను అంత కష్టపడ్డాను .. ఇంత కష్టపడ్డాను అని చెప్పలేదు. కానీ ఎందుకో ఈ రోజున చెప్పాలనిపిస్తోంది. నిజానికి నా జర్నీలోను ఎన్నో కష్టాలు ఉన్నాయి. సినిమాల్లో రావడానికి నేను కూడా యాక్టింగ్ నేర్చుకుని ..  డాన్స్ నేర్చుకుని .. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను.

నేనెవరో తెలియకపోయినా నన్ను పెట్టి సినిమా తీసిన తరుణ్ భాస్కర్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. 'ఈ నగరానికి ఏమైంది?' తరువాత నేను ' ఫలక్ నుమా దాస్' సినిమా చేసుకున్నాను. ఒక సినిమా నచ్చితే ఎంతగా గుండెల్లో పెట్టుకుంటారనేది నిరూపించిన సినిమా అది.

అలాంటి నేను ఒక్కో సినిమా చేసుకుంటూ ఈ రోజున ఇక్కడి వరకూ వచ్చాను. ఒక మంచి టీమ్ తో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు విద్యాసాగర్ చింతా నాకు చాలా కాలంగా తెలుసు. నేను ఈ కథకి బాగా సెట్ అవుతానని తనకి అనిపించడం వల్లనే నా దగరికి ఈ కథను తీసుకుని వచ్చాడు. రచయిత రవికిరణ్  కోలా పాత్ర కూడా చాలా ఉంది. నాకు వచ్చే క్రెడిట్ లో 80 శాతం ఆయనకే వెళుతుంది. ఆయన రాస్తేనే నేను చేయగలిగాను. ఇలాంటి ఒక మంచి బ్యానర్లో  చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News