చైతూ 'ల‌వ్ స్టోరీ'ని లైట్ తీసుకుంటున్నారా..?

Update: 2020-11-06 00:30 GMT
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య నటిస్తున్న తాజా చిత్రం ''లవ్ స్టోరీ''. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్నీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చైతూకి జోడీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' ప్రచార చిత్రాలతో శేఖర్ కమ్ముల మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడని అందరూ భావించారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న 'ల‌వ్ స్టోరీ'ని ఇటీవలే తిరిగి ప్రారంభించారు. అయితే ఈ సినిమాపై మొదట్లో క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ ఇప్పుడు లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 'లవ్ స్టోరీ' సినిమా షూటింగ్ కాస్త పెండింగ్ ఉంటడంతో ఇన్నాళ్లు డిజిటల్ రిలీజ్ గురించి ఎవరూ ఆలోచించలేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల వల్ల ఈ మధ్యే షూటింగ్ స్టార్ట్ చేసి మిగతా భాగం కంప్లీట్ చేస్తున్నారు. అలానే థియేటర్స్ కూడా నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. అయినప్పటికీ 'ల‌వ్ స్టోరీ' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తారా లేదా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో డిజిటల్ రిలీజ్ కి వెళ్తారా అనే దానిపై క్లారిటీ లేదు. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాపై ప్రస్తుతం ఎలాంటి సౌండింగ్ లేదని కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే హిట్ కాంబినేష‌న్ లో వస్తున్న 'లవ్ స్టోరీ' ని జనాలు లైట్ తీసుకునే పరిస్థితి వస్తుందని ఫిలిం సర్కిల్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News