దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజైంది తమిళ హిట్ చిత్రం తేరి. కానీ ఇప్పటికీ ఈ మూవీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అంతేకాదు.. తేరీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఇందులో ప్రముఖ హీరో నటిస్తున్నారని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ తాజాగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి సాహో సుజీత్ దర్శకత్వం వహించే వీలుందని కూడా టాక్ వినిపించింది.
ఇది ఇలా ఉంటే తేరి హిందీ రీమేక్ లో వరుణ్ ధావన్ నటించనున్నారని సమాచారం. అక్కడ రీమేక్ కి ఒరిజినల్ దర్శకుడు అట్లీ పని చేయనున్నారట.
అట్లీ కుమార్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా లయన్ అని పేరు పెట్టారు. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా ఇంతలోనే బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ కూడా మరో చిత్రం కోసం అట్లీతో చర్చలు జరుపుతున్నాడని తెలిఇంది. దళపతి విజయ్- సమంతా రూత్ ప్రభు జంటగా నటించిన 2016 చిత్రం తేరి హిందీ రీమేక్ కు అట్లీ ఓకే చెప్పారని కథనాలొస్తున్నాయి. తేరి అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం కమర్షియల్ ఎలిమెంట్స్ కారణంగా విజయ్ కెరీర్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అందుకే వరుణ్ ఆసక్తిని చూపారట. రుణ్ అట్లీని కలిశాడు...త్వరలో వారు సౌత్ సినిమా హిందీ రీమేక్ లో కలిసి పని చేయనున్నారు. విజయ్, సమంత జంటగా నటిస్తున్న తెరి లాక్ అయ్యింది! అంటూ టాక్ బలంగా వినిపిస్తోంది. తాజా పరిణామం వరుణ్ ధావన్ అభిమానులందరికీ సంతోషాన్నిచ్చేదే. థెరి రీమేక్ కోసం ధావన్ నే సంప్రదించినట్లు కొన్ని సంవత్సరాల క్రితం వార్తలు వచ్చాయి. అది ఎట్టకేలకు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. వరుణ్ ధావన్ ఈ రెండేళ్లలో తీరిక లేనంత షెడ్యూల్ తో వరుస చిత్రాలు చేస్తున్నాడు. అతను తదుపరి రెండు చిత్రాలలో కనిపిస్తాడు - జగ్ జగ్ జీయో .. భేదియా ఈ సంవత్సరం విడుదల కావలసి ఉంది. రాజ్ కుమార్ హిరానీ మరో చిత్రంలో కూడా ధావన్ నటించనున్నారు.
గత కొన్ని నెలలుగా రాజ్ కుమార్ హిరానీతో వరుణ్ అనేకసార్లు సమావేశమయ్యాడు. ఇద్దరూ కలిసి పని చేసేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇది రాజ్ కుమార్ హిరానీ స్వయంగా రాసిన నిజమైన కథ ఆధారంగా రూపొందించిన సినిమా. 2022 చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. వరుణ్ ధావన్ .. మోహిత్ సూరితో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. శ్రీరామ్ రాఘవన్ ఎక్కిస్ లోనూ నటించాల్సి ఉంది.