ఇంకో పదమూడు రోజుల్లో మహర్షి వచ్చేస్తున్నాడు. ఏడాది గ్యాప్ కాబట్టి అభిమానులు దానికి తగ్గ భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేయడంలో రెడీ అయిపోయారు. 1న జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ రూపంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాలని కోరుకుంటున్నారు. నిజానికి మహర్షి గత ఏడాది చిన్న టీజర్ వదిలినప్పుడు అందరూ ఫ్లాట్ అయిపోయారు. కాలేజీ కుర్రాడిగా అరనవ్వు విసురుతూ మహేష్ లుక్స్ కి ఫిదా అయిపోయారు. అది పుట్టిన రోజు కానుకగా సింగల్ షాట్ తో వదిలిన వీడియో అంతే.
కాని అసలైన టీజర్ కు అంత రెస్పాన్స్ రాలేదు. మహీ పాత సినిమాల కలబోతగా మాస్ మసాలా ఫీలింగ్ తెప్పించారని కామెంట్స్ వినిపించాయి. మొదటి పాట వచ్చినప్పుడు దేవి గొంతు బాలేదని రెండో పాట రిలీజైనప్పుడు రొటీన్ టైటిల్ ట్రాక్ ఫీలింగ్ వచ్చిందని మూడో డ్యూయెట్ వదలగానే దేవి ఇలా కొట్టాడు ఏంటి అని మాములు ట్రాలింగ్ జరగలేదు
మొన్న వచ్చిన పదరా పదరా నాలుగో ఆడియో సింగల్ చాలా బెటర్ అనిపించింది కాని ఇది కూడా శ్రీమంతుడు స్టైల్ లో ఉందన్న మాట ఈ పోలికల పర్వానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందా అనిపించేలా సాగింది. మొదట నుంచి ఈ పోలికలే మహర్షికి డేంజర్ గా మారుతున్నాయి. దానిలా దీనిలా ఉంది అనడమే తప్ప మహర్షి చాలా కొత్తగా భలే ఉందే అనే మాట మాత్రం అనిపించలేకపోయారు.
ఇప్పుడీ భారం మొత్తం ట్రైలర్ మీద పడుతుంది. అంచనాలకు భిన్నంగా కంటెంట్ గురించి సాలిడ్ స్ట్రాంగ్ గా ఒక అభిప్రాయం కలిగేలా కట్ చేస్తేనే ఇవన్ని మాయమైపోతాయి. లేకపోతే మళ్ళి ఇదే తరహా ట్రాలింగులు తప్పవు. ఇంకో పాట బాలన్స్ ఉంది. అదీ ఆ రోజే రావొచ్చు. సో మహర్షి ఇప్పుడీ పోలికల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం