'సీతారామం' హిట్ తో తొలి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు హను రాఘవపూడి. ఇండస్ర్టీకి వచ్చి దశాబ్ధం దాటిన తర్వాత అతని తొలి కమర్శియల్ సక్సెస్ గా చెప్పాల్సిన విజయం ఇది. తొలి సినిమా 'అందాల రాక్షసి' హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కాసులు రాబట్టిన చిత్రమైతే కాదు. ఆ తర్వాత నాలుగైదు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.
ఆ రకంగా హను రాఘవపూడి మంచి టెక్నీషియన్ గా మిగిలిపోయాడు తప్ప కమర్శియల్ డైరెక్టర్ గా నిరూపించుకోవడంలో ఇన్నాళ్లు వెనుకబడ్డాడు. ఎట్టకేలకు 'సీతారామం'తో హను సత్తా ఏంటో తెలిసింది. ఒక్క హిట్ తో నే టాప్ లీగ్ లో చేరుకున్నాడు. దీంతో హనుపై అసలైన ఒత్తిడి ఇప్పుడు మొదలైనట్లే. హను రాఘవ తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తాడు? ఎలాంటి కథతో రాబోతున్నాడు? అని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
ఇప్పటి వరకూ హను సినిమాలు ఒక సెక్షన్ ఒక ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేవి. 'సీతారామం'తో అందరికీ రీచ్ అయ్యాడు. దీంతో తెలుగు లో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తదుపరి ఏ సినిమా చేసినా అది కచ్చితంగా హిట్ అవ్వాలి. లేదంటే సెకెండ్ లీగ్ లో చేరే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో హను ముందు ఇప్పుడు రెండు రకాల సవాళ్లు ఎదురుగా ఉన్నాయి.
ఒకటి ఓ స్టార్ హీరో డేట్లు లాక్ చేయగలగాలి. కానీ అదంత ఈజీ కాదు. ప్రస్తుతం స్టార్స్ అంతా బహుళ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. పైగా అంతా పాన్ ఇండియా ఫీవర్ లో ఉన్నారు. రెండేళ్ల వరకూ ఏ హీరో డేట్లు దొరికే పరిస్థితి లేదు.
కంటెంట్ పరంగానూ హైలైట్ అవ్వాలి. అది హిట్ అవ్వగలగాలి. ఒకేసారి ఇలా రెండు రకాలుగా మెప్పించ గలిగితేనే హను స్టార్ దర్శకుల లీగ్లో కొనసాగ గలడు. లేదంటే వచ్చిన సక్సస్ క్రేజ్ అంతే వేగంగా పడిపోయే ప్రమాదం ఉంది. మరి హను ఎలాంటి స్ర్టాటజీతో ముందుకెళ్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.