నితిన్ హీరోగా గత ఏడాది భీష్మ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో వెంటనే రంగ్ దే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని స్పీడ్ పెంచారు. వెంకీ అట్లూరి రద్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. క్రేజీ కాంబో అవ్వడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురు చూశారు. కరోనా కారణంగా సినిమా విడుదల సంగతి పక్కన పెడితే కనీసం గత ఏడాది షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేక పోయింది. అయినా కూడా రంగ్ దే ను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఆ లెక్కన చూస్తే ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ మద్య యూనిట్ సభ్యులు కూడా సంక్రాంతికి వస్తాం అన్నట్లుగా ప్రకటించారు. కాని సినిమా సమ్మర్ కు వాయిదా పడింది. దాంతో ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు నితిన్ 'చెక్' సినిమాతో ముందుకు వస్తున్నాడు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిన్న టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఆ టీజర్ కు అనూహ్య రెస్పాన్స్ దక్కింది. సినిమాపై అంచనాలు పీక్స్ కు తీసుకు వెళ్లింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా అయ్యి ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. దాంతో చెక్ సినిమాను రంగ్ దే కంటే ముందే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. అయితే థియేటర్లకు చెక్ పెడతారా లేదా ఓటీటీకి చెక్ అంటారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.