రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ ఆర్ ఆర్ ఆర్ మరియు ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 25వ తారీకున ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుండగా వచ్చే నెల 29న అంటే సరిగ్గా నెల రోజులకు ఆచార్య సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలపై మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆచార్య లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
జక్కన్న దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు. సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో చరణ్ కనిపించబోతున్నాడు. ఆచార్య లో మాత్రం హీరోకు తక్కువ గెస్ట్ రోల్ కు ఎక్కువ అన్నట్లుగా ఆయన పాత్ర ఉంటుందట. ఆచార్య సినిమాలో చరణ్ మరియు చిరుల కాంబో సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. కనుక ఆచార్య సినిమా లో చరణ్ పాత్ర ఎలా ఉంటుందో అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీగా ఉన్నాడు. జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమా పబ్లిసిటీ జరుగుతుంది. ఈ సమయంలో ఆచార్య గురించి రెండు ముక్కలు మాట్లాడితే బాగుంటుంది కదా అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఆ వేదికపై ఆచార్య ను గురించి మాట్లాడితే పాన్ ఇండియా స్థాయిలో ఖచ్చితంగా ఆచార్య కు కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా మంచి వసూళ్లు నమోదు అవ్వడంతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ఆచార్య గురించిన చర్చ జరుగుతుందని అభిమానులు ఆశ పడుతున్నారు. కాని కారణం ఏంటో కాని చరణ్ ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఆచార్య గురించి మాట్లాడలేదు.
ఆచార్య లో తన పాత్ర ఏంటీ.. చిరంజీవితో నటన ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ఇలాంటి విషయాలను షేర్ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆచార్య గురించి కూడా కాస్త ఆలోచిస్తే వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఈజీ అవుతుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా చరణ్ కు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక సినిమా వేదిక మీద మరో సినిమా ను గురించి మాట్లాడటం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో చరణ్ ఆ పని చేయడం లేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.