'లైగర్' ప్లాప్ విజయ్ దేవరకొండకి ఏ రేంజ్ లో షాకిచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఉన్న పళంగా షూటింగ్ ప్రారభించిన 'జనగణమన' ని నిర్ధాక్షణ్యంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే శివ నిర్వాణ సినిమా 'ఖుషీ'లో భాగం కావాల్సి వచ్చింది. ఇప్పుడీ సినిమా షూటింగ్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇందులో హీరోయిన్ గా నటిస్తోన్న సమంతకి అనారోగ్యానికి గురి కావడంతో 'ఖుషీ' టీమ్ సైతం విశ్రాంతి లోనే ఉంది.
కొన్ని రోజులుగా ఎలాంటి షూటింగ్ నిర్వహించడం లేదు. ఎప్పుడు మళ్లీ రీస్టార్ట్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. సమంత పూర్తిగా కోలుకునే వరకూ సాధ్యమయ్యే పనికాదు. అన్ని కాంబినేషన్ సీన్స్ ఉండటం సహా వాటికి కంటున్యూటీ ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి వచ్చి పడింది. మరి ఇప్పుడు దేవరకొండ ఏం చేస్తున్నాడు? అంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడని తెలుస్తోంది.
కొత్త దర్శకులెవరైనా కథలు చెబుతుంటే వినడం సహా రౌడీబోయ్ అంతకు మంచి చేసేందేం లేదని తెలుస్తోంది. దీనంతటికీ కారణం ఓవర్ కాన్పిడెన్స్ అని ఫిలిం సర్కిల్స్ చర్చకొస్తుంది.
పూరి పై నమ్మకంతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తామన్న ఉద్దేశంతో కొత్త ప్రాజెక్ట్ లేవి కమిట్ అవ్వలేదు. చేతిలో అప్పటికే ఖుషీ కూడా ఉండటంతో ప్రస్తుతానికి ఉన్నవి చాలు లే అనుకున్నాడు తప్ప ప్లాన్ బీ లేకుండా పోయింది.
అదే ఐడియా ఉంటే ఖుషీ విశ్రాంతి సమయంలో ఆ సినిమా షూటింగ్ చేసుకునే వెసులు బాటు ఉండేది. ఇప్పుడా ఛాన్స్ లేకపోవడంతో ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముంబై వెళ్లి అక్కడ దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
అయినా కథ కుదరడం..దాన్ని వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లడం అన్నది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. తెలుగులో ఎలాగూ సాద్యం కాదు కనుక హిందీ లో ఆరకమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి దేవరకొండ కెరీర్ కిది ఊహించని ఖాళీగా చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.