కొత్త హీరోయిన్ల సహనానికి ఇది పరీక్షనే!

Update: 2021-05-26 00:30 GMT
తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పరిచయమవుతూనే ఉంటారు. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసి  నటన నేర్చేసుకుంటే, ఇక్కడ కుదురుకోవడానికి సమయం ఉంటుంది. లేదంటే ఇష్టం లేకపోయినా ఇంటిదారి పట్టవలసి ఉంటుంది. సహజంగానే ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంటుంది. వివిధ భాషల నుంచి హీరోయిన్లు దిగిపోతూ ఉంటారు. వాళ్లందరికిలోకి బెటర్ అనిపించుకోవడం .. అవకాశాలను గుమ్మం వరకూ తెచ్చుకోవడం చాలా కష్టం.

సాధారణంగా కథానాయికలు తమ మొదటి సినిమా ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా? తమని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆ విషయంలో ఆలస్యమైతే పాపం వాళ్ల అసహనాన్ని గురించి చెప్పడానికి అక్షరాలు చాలవు. అనన్య పాండే ... కేతిక శర్మ .. మీనాక్షి చౌదరి పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. మీనాక్షి చౌదరి మొదటి సినిమాగా చేసిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' ఎప్పుడో పూర్తయింది. కానీ ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు.

ఆ తరువాత సినిమాలుగా ఈ అమ్మాయి 'ఖిలాడి' .. 'హిట్ 2' సినిమాలను కూడా చక్కబెట్టేస్తోంది. కానీ మొదటి సినిమాకే ఇంతవరకూ మోక్షం కలగలేదు. ఇక కేతిక శర్మ 'రొమాంటిక్' సినిమాతో పరిచయం కానుంది. ఈ సినిమా కూడా కరోనా కారణంగా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వెళుతోంది. మరో రెండు నెలల వరకూ ఈ పిల్ల థియేటర్లలో కనిపించే అవకాశమైతే లేదు. ఇక అనన్య పాండే .. 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా షూటింగును పూర్తి చేసుకోలేదు. ఇలా తమ మొదటి  సినిమాల షూటింగులు పూర్తికాకపోవడం, పూర్తయితే విడుదలకి నోచుకోకపోవడంతో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు డీలాపడిపోతున్నారట పాపం.   
Tags:    

Similar News