`మైనే ప్యార్‌కియా`.. 1989లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం యావత్ భారతాన్ని ప్రేమలోకంలో విహరించేలా చేసింది. ఈ మూవీ ద్వారా పరిచయమైన భాగ్యశ్రీ తొలి చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. నటిగా క్రేజ్ వుండగానే సినిమాల నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మళ్లీ వెండితెర ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగ్యశ్రీ అత్యంత కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలు తన రీఎంట్రీ గురించి.. `రాధేశ్యామ్`లో తన పాత్ర గురించి.. ఆ పాత్ర ప్రాముఖ్యత గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. సినిమాలో తనది తల్లి పాత్ర కాదని.. చాలా కీలకమైన పాత్ర అని తెలిపింది. తన పాత్ర లేకపోలే సినిమా లేదని.. తన పాత్రని తీసేస్తే సినిమా మొత్తానికి ప్రాబ్లమ్ అవుతుందని అంత ముఖ్యమైన పాత్ర అని తెలిపింది భాగ్యశ్రీ.
సినిమా నా పాత్రతో మొదలై చివిరి వరకు సాగుతుందని అందుకే ఈ సినిమా చేశానని.. ఇకపై ఇలాంటి పాత్రలే చేస్తానని చెప్పుకొచ్చింది. ఈ మూవీని అత్యధిక భాగం విదేశాల్లో చేశారని అయితే హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన భారీ ఖర్చు చేసి గ్రాండ్ గా తీర్చిదిద్దిన సెట్‌లలో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వున్నాయని తెలిపింది. ఈ సినిమాని బుల్లితెరపై చూస్తే ఆ ఫీల్ వుండదని అందుకే చిత్ర బృందం ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తోందని తెలిపింది. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.