టాలీవుడ్ లో ఎప్పుడో కెరీర్ ప్రారంభించి ఇప్పటికి టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు కాజల్ అగర్వాల్, తమన్నా. 2007లో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. వీరిద్దరూ కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో రొమాన్స్ చేసి ఆడిపాడి అభిమానులను అలరించారు. తమన్నా, కాజల్ హీరోయిన్లుగా తెలుగునాట అడుగుపెట్టి దాదాపు 15ఏళ్ళు అవుతున్నా.. ఇంకా అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్నారు అంటే మాములు బ్యూటీలు కాదు.
కాజల్ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ చిత్రాలు చేస్తుంది. చిరంజీవి 152వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న ఆచార్య ఒకటి, మంచు విష్ణు హీరోగా తెరక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు మరొకటి. వీటితో పాటు కమల్ హీరోగా తెరక్కుతున్న భారతీయడు 2 సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ కావడం విశేషం. ఇక తమన్నా తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్, దట్ ఈజ్ మహాలక్ష్మీ చిత్రాలతో పాటు ఓ హిందీ చిత్రంలో కూడా నటిస్తుంది. అయితే సినీలోకంలో కొత్త నీరు వచ్చినా కొద్ది పాత నీరు పోవడం సహజం. కాజల్, తమన్నాలతో కెరీర్ స్టార్ట్ అయిన ఎంతో మంది హీరోయిన్లు మినిమం పదేళ్లు ఇండస్ట్రీని వాళ్ల అందాలతో ఏలారు.
మరి ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోయిన్లను చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే రెండు మూడు సినిమాలకే వాళ్ల కెరీర్ డిసైడ్ అయిపోతుంది. ఈ జనరేషన్ హీరోయిన్స్ కి ఎక్కువకాలం హీరోయిన్స్ గా సాగె అవకాశం తక్కువ. కాజల్, తమన్నా, అనుష్క, శ్రీయ లాంటి వాళ్లు ఇప్పటికి టాప్ హీరోయిన్లుగా ఆదరణ పొందుతున్నారంటే.. దానికి కారణం వాళ్ల డెడికేటెడ్ వర్క్. ఇప్పటి హీరోయిన్లు రెండు ప్లాపులు పడితే కనబడకుండా పోతున్నారు. ప్రయత్నాలు చేయడం కూడా మానేస్తున్నారు. అందుకే అప్పటి హీరోయిన్స్ లా ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ ఎక్కువకాలం ఉండరు అనే ఇండస్ట్రీ అంతా ప్రెసెంట్ హాట్ టాపిక్. చూడాలి మరి ఏ హీరోయిన్ అయినా మినిమం ఉంటారేమో..!