తోడేలు vs లవ్ టూడే.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత!

Update: 2022-11-25 02:30 GMT
ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద విభిన్నమైన సినిమాలు పోటీ పడబోతున్నాయి. అయితే చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలలో మాత్రం కేవలం అల్లరి నరేష్ సినిమా మాత్రమే ఉంది. ఎలక్షన్ కు సంబంధించిన ఒక కోర్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. సినిమాకు టాక్ బాగుంటేనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తాయి.

అయితే ఈ సినిమాతో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా హడావిడి చేస్తున్నాయి. ఆ రెండు సినిమాలను కూడా టాలీవుడ్ అగ్ర నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా విడుదల చేస్తూ ఉండడం విశేషం. ముందుగా నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల కాంతార సినిమాతో తక్కువ పెట్టుబడితో బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆయన హిందీలో తెరకెక్కిన భేడియా సినిమాను తెలుగులో తోడేలు టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 250కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక రెండు కోట్ల విలువ కలిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 2.5 కోట్ల బ్రేక్ టార్గెట్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఇక నిర్మాత దిల్ రాజు మరింత సేఫ్ జోన్ లో లవ్ టుడే సినిమాను విడుదల చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాని 250కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక మొత్తంగా ఈ సినిమా 2.75 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే బాక్సాఫీస్ వద్ద 3 కోట్ల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటివరకు అయితే దిల్ రాజు, అల్లు అరవింద్ డబ్బింగ్ సినిమాలతో మంచి లాభాలను అందుకున్నారు.

వారి ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసిన చాలా సినిమాలు 70% పైగా లాభాలను అందించాయి అయితే ఇప్పుడు రెండు విభిన్నమైన సినిమాలతో కూడా మంచి ప్రాఫిట్ అందుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాలు వారికి ఎలాంటి ప్రాఫిట్ అందిస్తాయో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News