ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రిలీజైన సినిమాల్లో అత్యంత అప్లాజ్ తెచ్చుకున్న సినిమా ‘తొలి ప్రేమ’నే. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ చిత్రానికి అటు విమర్శకుల నుంచి.. ఇటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వీకెండ్లోనే కాక ఆ తర్వాత కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్లింది. ఈ చిత్రం తొలి వారంలో రూ.17.5 కోట్ల షేర్.. రూ.32 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. వరుణ్ తేజ్ కెరీర్లోనే తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది.
నైజాం ఏరియాలో రూ.5.28 కోట్లు.. వైజాగ్ ఏరియాలో రూ.2.05 కోట్లు షేర్ రాబట్టిన ఈ చిత్రం.. సీడెడ్లో మాత్రం కొంచెం తక్కువగా రూ.1.61 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఆంధ్రాలోని మిగతా ఏరియాల్లో రూ.4.55 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి రూ.13.5 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ వచ్చింది. యుఎస్ లో ఈ చిత్రం రూ.5 కోట్ల గ్రాస్.. రూ.2.25 కోట్ల షేర్ వసూలు చేసింది తొలి వారంలో.
‘తొలి ప్రేమ’ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.23 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే ఇంకో రూ.5.5 కోట్లు వసూలు చేస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు వచ్చేస్తుందన్నమాట. ఈ సినిమాకు రెండో వీకెండ్లో కూడా మంచి వసూళ్లే వస్తున్నాయి కాబట్టి బయ్యర్లు లాభాల బాట పట్టడం కష్టం కాకపోవచ్చు. ఈ చిత్రాన్ని దిల్ రాజు రూ.18 కోట్లకు హోల్ సేల్ గా కొనేసి రిలీజ్ చేశాడు.