సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం.. మరో తొమ్మిది రోజుల్లో విడుదలవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చూసినప్పుడు మహేష్ తర్వాత అన్నిటికంటే ఆకట్టుకునే విషయం.. అక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్స్. ఆడియో ఫంక్షన్ ని కూడా ఎంతో అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దిన విషయం ఫ్యాన్స్ కు బాగానే గుర్తుంది. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సెట్స్ సినిమాలో 15 ఉంటాయట.
సాధారణంగా సెట్స్ కు ఉపయోగించే రంగులతో పోల్చితే.. బ్రహ్మోత్సవంలో కలర్స్ ను బాగా డిఫరెంట్ గా ఉపయోగించారు. ఆ కలర్ కాంబినేషన్స్ అదరహో అనాల్సిందే. ఇంతగా రంగులకు ప్రాధాన్యతనివ్వడానికి కారణం.. బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు కేరక్టర్. ఈ మూవీలో సూపర్ స్టార్ కి ఓ కలర్స్ తయారు చేసే కంపెనీ ఉంటుంది. ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పడం కోసమే.. ఇలా రంగులను ఉపయోగించామని చెబుతున్నాడు ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి.
మహేష్ బాబు ఇల్లు - టెర్రస్ - సత్యరాజ్ గది - మహేష్ రూమ్ - టెర్రస్ - పెళ్లి మండపం - నిశ్చితార్ధ వేడుక - బెజవాడ దుర్గ గుడి - తిరుమల దేవాలయం.. ఇలా మొత్తం 15 సెట్స్ వేశారట. ఇందులో మహేష్ రూమ్ - మండువా ఇల్లు తనకు బాగా నచ్చిన సెట్స్ అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్.