#RRR: మూడుతోనే సరిపెట్టనున్న జక్కన్న?

Update: 2019-09-17 11:59 GMT
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' ఇప్పుడు భారతదేశంలో సెట్స్ పై ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి.  బాహుబలి ఫ్రాంచైజీ ఘన విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇక తెలుగు వారికి ఇది మరింతగా ప్రత్యేకమైనది.  ఎందుకంటే ఈ సినిమా ఎన్టీఆర్ - చరణ్ నటిస్తున్న మెగా నందమూరి మల్టిస్టారర్. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

రాజమౌళి సినిమాల్లో బలమైన పాత్రలు..  పీక్స్ లో ఉండే ఎమోషన్స్.. యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాదు చార్ట్ బస్టర్ సాంగ్స్ కూడా ఉంటాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి చూసినా మనకీ విషయం తెలుస్తుంది.  బాహుబలి ఫ్రాంచైజీలో కూడా పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.  రాజమౌళి దర్శకత్వం వహించే ప్రతి సినిమాకు సంగీతం అందించే MM కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.  అయితే 'RRR' లో మాత్రం జస్ట్ మూడు పాటలే ఉంటాయట.  మరో పాట మాత్రం నేపథ్యంలో వినిపించే పాట అని సమాచారం.  ఇది సంగీత ప్రియులను కాస్త నిరాశపరిచే వార్తే.

ఈ సినిమా ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కావడంతో కథాగమనం దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని.. అందుకే తక్కువ పాటలతో సరిపెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే 'RRR' టీమ్ రీసెంట్ గానే బల్గేరియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభిస్తారని సమాచారం.


Tags:    

Similar News