గబ్బర్ సింగ్ 2 కథానాయికగా నిన్నటివరకూ అనీషా ఆంబ్రోస్ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ అమ్మడికి ఓ ఝలక్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం గబ్బర్ టీమ్ కథానాయికల అన్వేషణలో ఉంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, కలకత్తా వంటి చోట్ల ఆడిషన్స్ కూడా నిర్వహించారు. ఓ జాబితా దర్శకహీరోల దగ్గర ఉంది. అందులోంచి ఓ ముగ్గురు భామలకు అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఓ ఆరంగేట్ర నటిగా అనీషాకి ఇది పెద్ద దెబ్బ. ఈ భామతో కొన్ని సన్నివేశాలు షూటింగ్ చేసిన తర్వాత సెట్టవ్వలేదని భావించిన దర్శకహీరోలు తొలగించారని చెప్పుకుంటున్నారు. ఓ ప్రముఖ కాస్టింగ్ ఏజెంట్ చెప్పిన వివరాల ప్రకారం గబ్బర్‌సింగ్-2కి నాయికల్ని వెతుకుతున్నారు. టాప్ మోడల్స్ కి అవకాశం ఇచ్చే ఛాన్సుందట. ఇప్పటికే అనీషా ఒక కన్నడ సినిమాను సైన్ చూసి.. మరో రెండు వారాల్లో ఆ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగుళూరు మూవ్ అవుతున్నట్లు కూడా ఇన్ఫో ఉంది. అయితే పవన్ తన దగ్గర ఉన్న ముగ్గురు మోడల్స్ లో ఎవరిని ఫైనల్ గా సెలక్ట్ చేస్తాడనేది ఓ పెద్ద విషయం.
వాస్తవానికి గబ్బర్ సింగ్ 2 చిత్రానికి మొదటి నుంచి అగ్ర కథానాయికల్ని ఎంపిక చేయాలని భావించారు. కాజల్, శ్రుతిహాసన్, శ్రద్దాకపూర్ వంటి నాయికల్ని ఎంపిక చేయాలని చూసినా.. వీళ్లెవరూ కాల్షీట్లు లేవని చెప్పేశారు. అసలు సినిమాను కరెక్టుగా ప్లాన్ చేసుకోకపోవడం వలన పెద్ద పెద్ద హీరోయిన్లు పవన్ తో జతకట్టాలంటే కాస్త భయపడుతున్నారేమో. ఇప్పటికే 2 ఏళ్ళు లేటయ్యింది మరి.