అట్టర్‌ ఫ్లాప్‌ అయినా 100 కోట్లు వచ్చాయట!

Update: 2018-11-11 14:30 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌, బిగ్‌ బి అమితాబచ్చన్‌ లు మొదటి సారి కలిసి నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు ఆటతోనే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. ఈ చెత్త సినిమాకు 300 కోట్లు ఖర్చు చేసి, డబ్బు వృదా చేసిన నిర్మాతపై పోలీసు కేసు పెట్టాలంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్‌ వచ్చాయి. ఎంత ట్రోల్స్‌ వచ్చినా ఈ చిత్రంకు వచ్చిన క్రేజ్‌ నేపథ్యంలో మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల వసూళ్లను సాధించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అమీర్‌ ఖాన్‌ గత చిత్రాలు డిజాస్టర్‌ అయితే ఈ స్థాయి వసూళ్లు రాబట్టలేదు. అయితే ఈ సారి అమీర్‌ ఖాన్‌ మరియు అమితాబచ్చన్‌ లు ఇద్దరు ఉన్న కారణంగా ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. దాంతో పాటు సినిమా విడుదలకు ముందు భారీగా పబ్లిసిటీ జరిగింది. అందుకే సినిమాకు ఈస్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి. ఆదివారం కూడా ఒక మోస్తరు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా కూడా 150 కోట్ల వరకు వచ్చి ఆగే అవకాశం ఉంది.

300 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన చిత్రం 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వసూళ్లు చేస్తే ఏమాత్రం డిస్ట్రిబ్యూటర్లకు మరియు నిర్మాతలకు వర్కౌట్‌ కాదు. దాదాపు 75 శాతం నష్టాలు తప్పవని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. అమీర్‌ ఖాన్‌ గత చిత్రా రికార్డులతో పాటు బాహుబలి 2 రికార్డులను కూడా బద్దలు కొట్టడం ఖాయం అనుకున్న థగ్స్‌ ఇప్పుడు బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించలేని పరిస్థితి.

Tags:    

Similar News