పాత సీసాలో కొత్త సారాయి పోయడం ఎలానో తెలిస్తే చాలు. ఈజీగా హిట్ కొట్టేయొచ్చు. పాత కథల్నే తిప్పి కొత్తగా రాసుకునే సత్తా ఉంటే చాలు సులువుగా రచయిత అయిపోవచ్చు. పాత కథల్ని తిప్పి రాసి, కొత్త ట్రీట్‌మెంట్‌తో సినిమాలు తీసి హిట్ కొడుతున్నారంతా. ఇటీవలి కాలంలో రిలీజై ఘనవిజయం సాధించిన సినిమాల జాబితాని తిరగరాస్తే తెలిసొచ్చిన నీతి ఇది.
అంతెందుకు నిన్ననే రిలీజైన సందీప్ కిషన్ 'టైగర్' కథనే తీసుకుంటే.. దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహతుడి కోసం పడిచచ్చే కుర్రాడి కథ ఇది. స్నేహంపై ఇలాంటి కథలు టాలీవుడ్‌లో ఎన్ని రాలేదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్నేహం కోసం', అబ్బాస్-వినీత్ నటించిన 'ప్రేమదేశం' స్నేహంపై సినిమాలే. అంతకంటే ముందే వచ్చిన క్లాసిక్ సినిమా 'ఇద్దరు మిత్రులు' ఆ తరహానే. అల్లు అర్జున్ ఆర్య-2 కొత్త తరహా స్నేహానికి సంబంధించినది. స్నేహంలో లాజిక్‌ని నేర్పించిన సినిమా ఇది. ఇలా కాన్సెప్టు ఒకటే అయినా వాటన్నిటినీ చూపించిన విధానంలోనే ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపించింది.
కథ పాతదే అయినా ట్రీట్‌మెంట్ కొత్తదై ఉండాలి.. అని నమ్మి ఈ సినిమాల్ని తీశారంతే. నిన్న రిలీజైన టైగర్ చూస్తున్నంత సేపూ శంభో శివ శంభో, ఆర్య లాంటి సినిమాలు గుర్తు రాక మానవు. అక్కడా ఫ్రెండ్షిప్ కోసం సాహసాలు చేసే స్నేహితుడిని చూపించారు. లేటెస్టుగా టైగర్‌లోనూ స్నేహితుడు రాహుల్ కోసం సందీప్ ఎలాంటి సాహసం చేశాడన్నదే హైలైట్ పాయింట్‌గా చూపించారు.
అయితే ట్రీట్‌మెంట్‌లో రొటీన్ ఫ్యాక్షన్ కం యాక్షన్‌ని తీసుకోకుండా కాసింత లాజిక్ వాడారు. కాశీ నేపథ్యంలో కరుడుగట్టిన కులం పిచ్చోళ్లు ఎలా ఉంటారో చూపించే ప్రయత్నం చూపించారు. పరువు తీసినందుకు ప్రేమికులిద్దరినీ చంపేయడం అనే బర్నింగ్ ఇష్యూని జతచేసి ఇదే మా సినిమాలో కొత్తదనం అనిపించారు. ఇప్పుడర్థమైందా? పాత సీసాలో కొత్త సారాయి కథ!!