RRR టీమ్ పై బాలీవుడ్ హీరో క్రేజీ ట్వీట్!

Update: 2023-01-12 11:47 GMT
`RRR` హాలీవుడ్ స్టార్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డోన్ గ్లోబ్ అవార్డుల్లో `నాటు నాటు` బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌ విభాగంలో అవార్డుని సొంతం చేసుకుని చ‌రిత్ర సృష్టించింది. ఏసియాలోనే తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన సినిమాగా `RRR` చిర‌త్ర సృష్టించింది. ఇది నిజంగా గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇండియా వ్యాప్తంగా ప్ర‌ముఖులు, స్టార్స్‌, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ RRR టీమ్ ని అభినందిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌వంస‌లు కురిపిస్తున్నారు.

అంతే కాకుండా ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి ప్ర‌ముఖులు, స్టార్స్ `RRR`పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ కొనియాడుతున్నారు. ఇదిలా వుంటే ఇండియ‌న్ స్టార్స్ మాత్రం ఓ రేంజ్ లో `RRR` ని చూపి పొంగిపోతున్నారు. ఇండియ‌న్ కు ద‌క్కిన అరుదైన ఘ‌న‌త‌గా చెబుతూ ఇదొక ప్రౌడ్ మూవ్ మెంట్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. `RRR` టీమ్ కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

అంతే కాకుండా ఇది భార‌తీయ సినీమాకు అత్యంత గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, మ‌న సంగీతానికి ద‌క్కిన గౌర‌వ‌మ‌ని పొగుడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న `RRR` టీమ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ సంద‌ర్భంగా సోషల్ మీడియా వేదిక‌గా `నాటు నాటు` పాట‌కు చ‌క్క‌టి స్టెప్స్ వేస్తూ ఓ వీడియోని కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. అంతే కాకుండా ఈ వీడియోకు అంద‌మైన క్యాప్ష‌న్ ని కూడా జ‌త చేయ‌డం విశేషం.  

ఇది నిన్న‌టి విజ‌యం త‌రువాత మా విజ‌య నృత్యం. భార‌తీయ సినిమాకు ఇది భారీ విజ‌యం. `RRR`టీమ్ మొత్తానికి అభినంద‌న‌లు` అంటూ రాజ‌మౌళి, కీర‌వాణి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు ఈ పోస్ట్ ని ట్యాగ్ చేశాడు. ప్ర‌స్తుతం టైగ‌ర్ ష్రాఫ్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారి ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకుంటోంది. తెలుగు రీమేక్ `ప‌రుగు` ఆధారంగా తెర‌కెక్కిన `హీరోపంతీ` రీమేక్ తో హీరోయిగా తెరంగేట్రం చేసిన టైగ‌ర్ ష్రాఫ్ ఇప్ప‌టికీ తెలుగు, త‌మిళ రీమేక్ ల‌పైనే అత్య‌ధికంగా ఆధార‌ప‌డుతూ వాటి రీమేక్ ల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. టైగ‌ర్ ష్రాఫ్ న‌టిస్తున్న తాజా మూవీ వికాస్ బెహెల్ ద‌ర్శకుడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News