హలో బన్నీ.. ఇదొకసారి ఆలోచించు

Update: 2018-11-17 04:34 GMT
‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఇప్పటి వరకు మరే సినిమాను ప్రారంభించలేదనే విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ తర్వాత సినిమా ఉండబోతుందనే విషయం మాత్రం కన్ఫర్మ్‌ అయ్యింది. అయితే ఎప్పుడు వీరి కాంబో మూవీ ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘సోనూ కే టీటూ కి స్వీటీ’ ని రీమేక్‌ చేయాలని త్రివిక్రమ్‌ భావించినా ఆ కథలో పలు మార్పులు చేర్పులను బన్నీ అండ్‌ టీం చెప్పారంటూ సమాచారం అందుతోంది. బన్నీ - త్రివిక్రమ్‌ ల మూవీ ఇంకా ఫైనల్‌ కాలేదు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాప్‌ హైదరాబాద్‌ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా తనకు అల్లు అర్జున్‌ అంటే అభిమానం అంటూ పేర్కొన్నాడు.

అల్లు అర్జున్‌ స్టైల్‌ ను తాను అభిమానిస్తానని, నాకు అల్లు అర్జున్‌ తో కలిసి నటించాలనే కోరిక ఉందని కూడా టైగర్‌ వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌ లో ఇప్పుడిప్పుడే స్టార్‌ డంను దక్కించుకుంటున్న టైగర్‌ కు అల్లు అర్జున్‌ తో నటించాలనే కోరిక ఉండటం బన్నీ స్థాయిని పెంచిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోంది.

బన్నీ తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ అయ్యి ఛానెల్స్‌ లో యూట్యూబ్‌ లో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీ ప్రేక్షకుల్లో ఇప్పటికే బన్నీ నోటెడ్‌ అయ్యాడు. అందుకే టైగర్‌ తో కలిసి తెలుగు - హిందీ చిత్రాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మల్టీస్టారర్‌ చిత్రాల ట్రెండ్‌ నడుస్తుంది కనుక వీరిద్దరి కాంబో మూవీకి భారీ ఆధరణ దక్కే అవకాశం ఉంది. అలా కాకున్నా సోనూ కే టీటూ కి స్వీటీ చిత్రంలో మరో హీరో పాత్రకు అయినా టైగర్‌ ను తీసుకుంటే బాగుంటుంది. మరి బన్నీ ఆలోచన ఏంటో చూడాలి.

Tags:    

Similar News