సినిమాలలో తమ అభిమాన హీరోల డ్రెస్సింగ్ స్టైల్ ను - వారి మేనరిజాన్ని అనుకరించడం కొంతమంది అభిమానులకు అలవాటే. సరదాగా వాటిని అనుకరించడం వల్ల పెద్ద ప్రమాదం కూడా లేదు. అయితే, నిపుణుల పర్యవేక్షణలో - డూప్ల సాయంతో హీరోలు చేసే స్టంట్లను ఏమాత్రం అనుభవం లేకుండా అభిమానులు అనుకరించడం మాత్రం చాలా ప్రమాదకరం. `బాహుబలి-2` లో ప్రభాస్ లాగా ఏనుగు తొండంపై పైకి ఎక్కాలని కేరళలోని ఓ వ్యక్తి ప్రయత్నించి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా, అభిమానం వెర్రితలలు వేసిన ఓ యువకుడు తన అభిమాన హీరో చేసిన స్టంట్ ను అనుకరించాడు. అంతేకాదు, ఆ ఘనకార్యానికి సదరు హీరోనే ఇన్ స్పిరేషన్ అంటూ ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన హీరో...అభిమానిని ఉద్దేశించి చివాట్లు పెట్టాడు.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ డూప్ లేకుండా స్టంట్లను చేస్తుంటాడు. 2016లో వచ్చిన ‘ప్లయింగ్ జాట్’ సినిమాలో ఈ తరహాలోనే టైగర్ చాలా స్టంట్లు చేశాడు. ముంబైకి చెందిన అమన్ అనే అభిమాని టైగర్ ను అనుకరిస్తూ 13 అడుగుల గోడపై నుంచి దూకేశాడు. అంతేకాకుండా ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘నేను భయాన్ని జయించాను. అంత పై నుంచి దూకడం అంత ఈజీ కాదు అందుకు చాలా ధైర్యం కావాలి. కింది నుంచి చూస్తే ఏలాంటి భయం ఉండదు.. కానీ గోడపైకి ఎక్కితే భయం అనేది తెలుస్తుంది. నాకు నేనే హీరోగా ఫీలై అలా కిందకు దూకాను. నాకు ఈ స్పూర్తిగా నిలిచిన టైగర్ ష్రాఫ్ కు కృతజ్ఞతలు’ అని ట్వీట్ కూడా చేశాడు. ఆ వీడియో చూసిన టైగర్ కు చిర్రెత్తుకొచ్చింది. అమన్ ను ఉద్దేశించి టైగర్ రిప్లై ఇచ్చాడు. ‘నువ్వు ఈ విధంగా చేయడం చాలా మూర్ఖత్వం. నీ లైఫ్ ను ఈ విధంగా ఎప్పుడు రిస్క్ చేయవద్దు. చిత్ర షూటింగ్ సమయంలో ఈ విధమైన స్టంట్లు చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. ఈ విధమైన విన్యాసాలను స్వతహాగా చేయకండి’ అని టైగర్ అమన్ ను ఉద్దేశించి ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో, దానికి టైగర్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయింది.