నాలుగు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడినదే లేదు. మరికొన్ని నెలల వరకు బొమ్మ పడుతుందనే నమ్మకం లేదు. అందుకే పలు సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్దం అవుతున్నాయి. బాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. సౌత్ తో పోల్చితే బాలీవుడ్ చిత్రాలు అధికంగా ఓటీటీ విడుదల అవుతున్నాయి. ఈ నెలలో అధికంగా ఓటీటీ విడుదల అవుతున్నాయి. వచ్చే నెలలో మరిన్ని సినిమాలు కూడా ఓటీటీ దారిలో వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే బాలీవుడ్ చిత్రం ‘యార’ ను ఓటీటీ ద్వారా డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వారు యార చిత్రం స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్నారు. తాజాగా చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30న జీ5 లో యార చిత్రం స్ట్రీమింగ్ ప్రీమియర్స్ ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంపై హిందీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
టిగ్మాన్షు ధులియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మహ్మద్ అలీ సాప్‌ా.. ఇమ్రాన్ హస్నే కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. శృతి హాసన్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. శృతి హాసన్ నటించిన సినిమా అవ్వడంతో యార పై సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తి కనబర్చుతున్నారు.