శారీర‌కంగా హింసించాడ‌న్న టీవీ న‌టి

Update: 2019-10-02 01:30 GMT
లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లతో టీవీ న‌టి టీనా పేరు మార్మోగిన సంగ‌తి తెలిసిందే. హిందీ సీరియ‌ళ్ల‌తో పాపుల‌రైన స‌ద‌రు న‌టి దయాన్‌ షూటింగ్‌ సమయంలో నటుడు మోహిత్‌ మల్హోత్రా తనను అనుచితంగా తాకాడ‌ని ఆరోపించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ఆ త‌ర్వాత ఆ గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.

తాజాగా త‌న స్నేహితుడే త‌న‌ను మాన‌సికంగా.. శారీర‌కంగా వేధించాడ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం మ‌రోసారి వేడెక్కిస్తోంది. అత‌డి వ‌ల్ల తీవ్ర‌మైన డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాన‌ని టీనా తెలిపారు. ఐదేళ్ల పాటు క‌లిసి ఉన్నాం. అత‌డు శారీరకంగా.. మానసికంగా హింసించాడు. మాటలతో చిత్ర‌వ‌ధ చేశాడు. ఇలా అత‌డిపై మీడియా ముందు మాట్లాడతానని ఎన్న‌డూ అనుకోలేదు... ఎంతో నరకం అనుభవించాను గ‌నుకే  చెబుతున్నాను అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కామ‌న్ స్నేహితుల ద్వారా ప‌రిచ‌యం స్నేహంగా మారింది. ప్రేమ‌లో ప‌డ్డాను. ప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేని అత‌డు మాన్ స్ట‌ర్ గా మారి న‌న్ను వేధించాడు అని తెలిపారు టీనా. ఆ వేధింపులు భరించే ఓపిక లేక అతడితో బంధానికి స్వస్తి పలికాను అని వెల్ల‌డించారు. అత‌డి వ‌ల్ల మ‌నుషుల‌పైనే న‌మ్మ‌కం పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కుటుంబం స్నేహితుల వ‌ల్ల‌నే కోలుకున్నాన‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌కు చెంద‌ని వ్య‌క్తితో కొత్త జీవితం ప్రారంభించాల‌ని ఉంద‌ని అన్నారు.



Tags:    

Similar News