ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆధరణ ఉన్న టీవీ షోల్లో బిగ్ బాస్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియాలో కూడా బిగ్ బాస్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. హిందీ బిగ్ బాస్ ఇప్పటి వరకు 13 సీజన్ లు పూర్తి చేసుకుని ఈ వారంలో 14వ సీజన్ ప్రారంభం కాబోతుంది. సీజన్ ప్రారంభంకు రెండు మూడు నెలల ముందు నుండే కంటెస్టెంట్స్ విషయమై మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఆ సెలబ్రెటీ ఎంపిక.. ఈ స్టార్ షో లో ఉండబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ప్రచారం జరుగుతుంది. ఏ భాషలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్నా ఈ పుకార్లు అనేవి చాలా కామన్. సీజన్ ప్రారంభంకు ముందు ప్రచారం అయ్యే పేర్లలో సగానికి పైగా పైనల్ జాబితాలో ఉండవు. హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో ప్రముఖ హిందీ టీవీ స్టార్ టీనా దత్తా కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
గత కొన్ని రోజులుగా టీనా దత్తా బిగ్ బాస్ ఎంట్రీ గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో షో ప్రారంభంకు కొన్ని రోజుల ముందు ఆమె అసలు విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ అంటే నాకు అమితమైన ఇష్టం. కాని నేను బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడం లేదని కంటెస్టెంట్ గా కంటే ప్రేక్షకురాలిగా మాత్రమే బిగ్ బాస్ నాకు ఇష్టం అంటూ ఒక పొయెటిక్ పద్దతిలో టీనా దత్తా తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ వార్తలు ఎలా ప్రారంభం అయ్యాయో కాని అప్పటి నుండి నాకు నీకు ఎంగేజ్ మెంట్ అయ్యిందా అన్నట్లుగా ఫోన్ లు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. నాకు నీకు రిలేషన్ ఎలా మొదలు అయ్యిందో తెలియదు కాని నేను నిన్న కంటెస్టెంట్ గా మాత్రమే ప్రేమిస్తాను అంటూ బిగ్ బాస్ ను ఉద్దేశించి ఒక లేఖ రాసి సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసింది.