నందమూరి బాలకృష్ణ ‘యోధుడు’ కాదు.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’యే. ఎందుకంటే ఈ టైటిల్ ఆల్రెడీ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా అయిపోయింది. డైరెక్టర్ క్రిష్ నిర్మాణ సంస్థ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ కింద నిర్మాత రాజీవ్ రెడ్డి ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడాన్ని బట్టి బాలయ్య వందో సినిమాకు ఇదే టైటిల్ అని ఫిక్సయిపోవచ్చు.
దీన్ని బట్టి ఇంకో విషయం కూడా కన్ఫమ్ అయింది. బాలయ్య-100లో క్రిష్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండే అవకాశాలున్నాయి. టైటిల్ బయటికి వెళ్లకూడదన్న ఉద్దేశంతో క్రిష్ తన సంస్థ పేరు మీద రిజిస్టర్ చేయించి ఉంటే ఉండొచ్చేమో కానీ.. మరోవైపు ఈ సినిమాకు క్రిష్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండాలని ఆశిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. నిర్మాణంలో మేజర్ షేర్ మాత్రం 14 రీల్స్ వాళ్లదే. సాయి కొర్రపాటి సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. అంటే మూడు నిర్మాణ సంస్థలు కలిసి బాలయ్య వందో సినిమాను నిర్మించబోతున్నాయన్నమాట.
బాలయ్య మార్కెట్ వాల్యూను మించి రూ.50 కోట్లకు పైగా బడ్జెట్ తో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని నిర్మించబోతున్నారు. ఐతే వందో సినిమాకు ఉన్న క్రేజ్ వేరే కాబట్టి ఈ బడ్జెట్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. క్రిష్ ఇంకా పూర్తి స్థాయి స్క్రిప్టు తయారు చేయలేదని సమాచారం. ఉగాది రోజు సినిమాను లాంఛనంగా ఆరంభించి.. ఆ తర్వాత నెల వ్యవధిలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లే అవకాశాలున్నాయి.