#RRR: అలాంటి అప్పీల్ ఉన్న టైటిల్ కావాలి!

Update: 2018-11-18 04:48 GMT
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న #RRR ఈమధ్యే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 19 వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లకమునుపే ఈ సినిమా టైటిల్ గురించి భారీగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే #RRR అంటే 'రామ రావణ రాజ్యం' అనే స్పెక్యులేషన్లు ప్రచారంలో ఉన్నాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదట.  నిజానికి ఈ సినిమాకు ఏం టైటిల్ పెట్టాలా అనే విషయంలో రాజమౌళి తన ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చలు జరుపుతున్నారని టాక్. #RRR  మల్టిలాంగ్వేజ్ సినిమా కాబట్టి తెలుగును మాత్రమే దృష్టి లో ఉంచుకుని పెట్టడం కష్టం. తెలుగుతో పాటు.. తమిళ.. హిందీ భాషలకు ఒకే టైటిల్ ఉంటే బాగుంటుందని ఆలోచన.  అంటే 'బాహుబలి' లాగా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉంటూ అదే సమయంలో పవర్ఫుల్ గా కూడా ఉండాలి. కొన్ని సంస్కృత పదాలు మన తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషలన్నిటిలో కామన్ గా ఉంటాయి.  ఎందుకంటే భారతీయ భాషలలో చాలావాటికి సంస్కృతమే మూలం. అందుకే అలా అందరికీ తెలిసిన ఒక సూపర్ టైటిల్ కోసం ఇప్పుడు కసరత్తు జరుగుతోందట.

రాజమౌళి సాధారణంగా తన సినిమాకు టైటిల్ త్వరగానే ప్రకటించే అలవాటు ఉంది. దాదాపు ఫిబ్రవరి లో #RRR రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యే లోపే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.  మరి జక్కన్న ఎలాంటి టైటిల్ తో ముందుకొస్తాడో వేచి చూడాలి.
    

Tags:    

Similar News