టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒక్కరు రాఘవేంద్ర రావు. లెజెండ్రీ దర్శకుడు అయిన రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తెలుగులో పలు చిత్రాలను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలు ఏవీ కూడా ఆయనకు దర్శకుడిగా సక్సెస్ ను తెచ్చి పెట్టలేక పోయాయి. టాలీవుడ్ పై ఆశలు వదులుకున్న దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ ప్రస్తుతం బాలీవుడ్ లో 'మెంటల్ హై క్యా' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్ర టైటిల్ డాక్టర్ ల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
టైటిల్ వివాదం మొదలైన సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు లైట్ గా తీసుకున్నారు. కొన్ని రోజులు మీడియాలో హడావుడి జరిగి ఆ తర్వాత అంతా కామ్ అవుతారని దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి మరియు నిర్మాత ఏక్తా కపూర్ లు అనుకున్నారు. కాని అనూహ్యంగా వివాదం మరింత పెద్దది అవుతోంది. మెంటల్ హై క్యా చిత్రంపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో జనాలు ఈ చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో సినిమా టైటిల్ మార్చితే సినిమాకు ఏర్పడిన బజ్ పోతుందేమో అనే భయంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. మెంటల్ హై క్యా టైటిల్ తో ఇప్పటికే టీజర్, పోస్టర్స్ ఇంకా పబ్లిసిటీ వీడియోలు విడుదల చేయడం వల్ల మరో టైటిల్ తో సినిమా విడుదల చేస్తే ప్రేక్షకుల్లో బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందేమో అనే భయం ఉంది. మణికర్ణిక చిత్రం తర్వాత కంగనా నటించే సినిమా మెంటల్ హై క్యా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో టైటిల్ ను మార్చకుండా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో సక్సెస్ కాలేక పోయిన ప్రకాష్ కోవెలమూడి బాలీవుల్ అయినా మెప్పించాలని అనుకుని చేస్తున్న ప్రయత్నం కాస్త ఇలా చిక్కుల్లో పడింది. జూన్ 21న విడుదల కావాల్సిన ఈ చిత్రం టైటిల్ చిక్కులు తొలగి పోయేనా చూడాలి.